Movies"2 కంట్రీస్" రివ్యూ & రేటింగ్

“2 కంట్రీస్” రివ్యూ & రేటింగ్

కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న తర్వాత కెరియర్ మొదట్లో సక్సెస్ లను అందుకున్న సునీల్ పూర్తిగా ఫేడవుట్ అవుతున్నాడు. హీరోగా ఇయర్ కు ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తున్నా సరే అవేవి మంచి ఫలితాన్ని ఇవ్వడం లేదు. లాస్ట్ ఉంగరాల రాంబాబు నిరాశ పరచగా కన్నడలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ రీమేక్ గా అదే టైటిల్ తో వచ్చాడు సునీల్.

కథ :

ఈజీగా డబ్బు సంపాదించే ఆలోచన ఉన్న కుర్రాడు ఉల్లాస్ (సునీల్) ఓ హ్యాండిక్యాప్ అమ్మాయిని పెళ్లాడాలని అనుకోగా అది కుదరక తన చిన్ననాటి స్నేహితురాలు లయ (మనిషా రాజ్) ను పెళ్లాడతాడు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య డిస్టబెన్స్ వస్తుంది. ఉల్లాస్ అసలు ఎందుకిలా చేస్తాడు అన్నది అసలు అర్ధం కదౌ. ఇంతకీ ఉల్లాస్, లయలు కలిశారా..? వారిద్దరి మధ్య దూరానికి గల కారణాలు ఏంటి అన్నది అసలు సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సునీల్ హీరోగా ఎందుకో అంత ఎనర్జిటిక్ గా అనిపించలేదు. క్యారక్టరైజేషన్ విషయంలో ఇంకాస్త గ్రిప్పింగ్ తో ఉండాల్సింది. సునీల్ పరంగా ఓకే అనిపించుకోగా.. హీరోయిన్ గా మనిషా రాజ్ పర్వాలేదు అనిపించుకుంది. సంజనా గర్లాని కూడా స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించింది. షాయాజి షిండే, సితారా లాంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది.. ఎడిటింగ్ ట్రిల్ చేయాల్సి ఉంది. ఎన్.శంకర్ డైరక్షన్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా అనిపించదు. కన్నడలో సూపర్ హిట్ సినిమాను ఇక్కడ కిచిడి చేశారని చెప్పొచ్చు. గోపి సుందర్ మ్యూజిక్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

విశ్లేషణ :

కన్నడలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీ సినిమా తెలుగులో ఎంతోమంది చేతులు మారి సునీల్ హీరోగా ఎన్.శంకర్ డైరక్షన్ లో వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో తెరకెక్కించడంలో విఫలమయ్యాడు దర్శకుడు శంకర్. కన్నడ సినిమా రీమేక్ అయినా మక్కీకి మక్కీ దించిన ఆలోచన వస్తుంది.

దిలీప్, మమతా మోహన్ దాస్ నటించిన ఆ సినిమా అక్కడ కామెడీ ఎంటర్టైనర్ గా అలరించగా ఇక్కడ మాత్రం అది వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు. సినిమా అంతా గజిబిజిగా ఉంటుంది. కామెడీ సీన్స్ ఏమాత్రం క్లిక్ అవలేదు. కథ కథనాల్లో దర్శకుడు ఏమాత్రం పట్టు సాధించలేదు. మొదటి భాగం అసలు అలరించలేదు కాని సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అని చెప్పొచ్చు.

మొత్తానికి సునీల్ మళ్లీ ఈ సినిమాతో నిరాశ పరచాడు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ కథనాలతో వచ్చి మళ్లీ కెరియర్ లో వెనక్కి తగ్గాడని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

లాజిక్ లెస్ సీన్స్

పూర్ స్క్రిప్ట్

బాటం లైన్ :

సునీల్ 2 కంట్రీస్.. నిరాశపరచే ప్రయత్నం..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news