సంచలనం రేపుతోన్న వర్మ ట్విట్.. ఆ బూతులేంటి ..?

 
రాంగోపాల్ వర్మ ఏది చేసినా .. చెప్పినా సంచలనమే అవుతుంది. ఎప్పుడు ఎదో ఒక వివాదం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆయన టీసీ ప్రతి సినిమా కూడా ఆయన లాగే వివాదాల్లో చిక్కుకుంటుంటాయి. అయితే వర్మ తాజాగా చేసిన ఒక ట్విట్ అక్కినేని కుటుంబంలోనే కాదు సినీవర్గాల్లో కూడా దుమారం లేపుతోంది.

శివ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అక్కినేని నాగార్జునతో కలిసి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. ఈ కాంబినేషన్ మరోసారి ఎలాంటి సంచలనానికి తెరతీస్తుందోనంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య స్నేహం శివ సినిమా నుంచి అలాగే కొనసాగుతోంది.

తాజాగా వర్మ నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని హలో చిత్రం పై స్పందించాడు. ఆ మూవీకి సంబంధించిన టీజర్ 16న రిలీజ్ చేస్తామంటూ ట్విటర్ లో ఓ పోస్టర్ వదిలాడు అఖిల్. ఈ పోస్టర్ కు అద్భుత స్పందన వస్తోంది. అఖిల్ పోస్టర్ చూసి ఫిదా అయిన వారి లిస్ట్ లో వర్మ కూడా చేరిపోయాడు.

అఖిల్ హలో మూవీ పోస్టర్ కు ఫిదా అయిపోయిన వర్మ తాజాగా దానిపై దారుణంగా కమెంట్స్ రాస్తూ స్పందించాడు. బూతులో మామూలుగా వాడే ఊతపదాన్ని వాడుతూ.. హలో.. ఇదో మ…ర్ ఫకింగ్, మైండ్ బ్లోయింగ్ పోస్టర్. దీన్ని చూస్తే అఖిల్ అక్కినేని అసలు సిసలు మొదటి సినిమా ఇదే అన్నట్లుగా వుంది అంటూ వర్మ ట్విట్ చేసాడు.

Leave a comment