శివమణి తరువాత నాగ్ ఖాకీ యూనిఫాం వేసింది లేదు
నాకొంచెం మెంటల్ అంటూ పూర్ణ మార్కెట్ ని హడలెత్తించాడుగా
ఇప్పుడు ఆర్జీవీతో చేసేసినిమాలోనూ ఆయన మరో మారు లాఠీ పట్టి ఠారెత్తించనున్నారు.
వివరాలిలా :: తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల “శివ” సినిమా ఒక చెరగని సంతకం చేసింది. “శివ” విడుదలై 28 ఏళ్లవు తున్నా ఇప్ప టికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఓ నిఘంటువు. ఇంకా చెప్పాలంటే ఓ రిఫరెన్స్ కోడ్. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీట్ కానుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల “రాజు గారి గది 2” ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.
రాంగోపాల్ వర్మే స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలు కానుంది. “శివ” సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ “కంపెనీ” బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవీ చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించను న్నారు.