తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ లో ఓ సరికొత్త ఆహ్లాదకర వాతావరణం నెలకొంటోంది. ఈ మధ్య కాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఊపందుకుని హీరోల మధ్య చక్కని ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడడం నిజంగా సంతోషం కలిగించే విషయం అనుకుంటుండగానే ఒకరి ఆడియో ఫంక్షన్లకి మరొకరు హాజరవ్వడం, ఒకరి శుభకార్యాలకు మరొకరు హాజరవ్వడం చేస్తున్నారు. ఇది ఇండ్రస్ట్రీలో చాలా శుభ పరిణామం.
తాజాగా ఫ్యామిలీ హీరో జగపతి బాబు నారా రోహిత్ కోసం మాట సాయం చేస్తున్నాడు అనే వార్త ఈ సొంతశాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ అనే సినిమా తో నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ చిత్రంపైనే రోహిత్ ఆశలు పెట్టుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఇటీవలే జరిగింది.
చిత్ర ట్రైలర్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యం లో జగపతిబాబు తన బేస్ వాయిస్ తో వాయిస్ ఓవర్ చెప్పనున్నారట. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ మూవీ లో రెజినా హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్ర బాబు, వంశీ వినోద్ సంయుక్తంగా నిర్మించారు.