చిన్న హీరోగా వచ్చి పెద్ద హీరో స్థాయికి చేరుకున్న హీరో ఈ మధ్య కాలంలో ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం నాని అని వెంటనే చెప్పేస్తారు. ప్రస్తుతం నాని ఏ స్టార్ హీరో అందుకోలేని అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి నిన్నుకోరి దాకా వరుసగా ఏడు హిట్ లు కొట్టి నేచురల్ హీరో అన్న బిరుదుకి న్యాయం చేస్తున్నాడు నాని.
ఏ స్టార్ హీరో కి అయినా రెండు సినిమాలు వరుసగా హిట్ రాయితీ మూడోది కచ్చితంగా ప్లాప్ ఇది ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంది ఒక్క నాని విషయంలో తప్ప. నాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం నాని రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే చిత్రం వచ్చే నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. దిల్‌రాజు నిర్మించడంతో పాటు నాని, సాయి పల్లవి జంటగా నటించడంతో సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.
ఇప్పటి వరకు నాని కెరీర్‌లో దాదాపు అన్ని సినిమాలు కూడా 25 కోట్లకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది లేదు. కాని ఈ సినిమా మాత్రం అన్ని ఏరియాల రైట్స్ , ఆన్ లైన్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఏకంగా 40 కోట్ల వరకు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నాని గత చిత్రం ‘నేను లోకల్’ మరియు ఇంకా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద 30 నుండి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడం జరిగింది. అందుకే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
దిల్‌రాజు ఈ చిత్రం కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్ 18 కోట్లు. ప్రమోషన్‌తో కలిపి మొత్తంగా 20 కోట్ల మేరకు ఈ చిత్రానికి ఖర్చు చేయబోతున్నాడు. 20 కోట్ల బడ్జెట్ చిత్రానికి 40 కోట్ల బిజినెస్ జరగడం టాలీవుడ్ స్టార్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. నాని మాకంటే బెటర్ గానే ఉన్నాడు అనుకుంటూ లోలోపల బాధపడిపోతున్నారు.
ఇటీవలే విడుదలైన టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ‘ఫిదా’తో ఆకట్టుకున్న సాయి పల్లవి మరోసారి తన సత్తా చాటి తెలుగులో స్టార్ అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. రోజురోజుకి నాని తన మార్కెట్ ను విస్తరించుకోవడం చూస్తుంటే తొందర్లోనే స్టార్ హీరోల స్థాయి అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.