గ్లామర్, అభినయంతో తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుకుంటూ టాప్ హీరోయిన్ స్థానంలో నిలుస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా. తన కెరియర్ లో ఎన్నో హాట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్క్ సుందరి. బాలీవుడ్ లో కొంచెం నిరాశపరిచినా.. టాలీవుడ్ లో మాత్రం ఎప్పుడూ టాప్ హీరోయిన్ గానే కెరియర్ కొనసాగిస్తోంది.
ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. సందీప్ కిషన్ తో ఓ సినిమా, కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను అలాగే ప్రముఖ బాలీవుడ్ హిట్ చిత్రం క్వీన్ రీమేక్ సినిమాను చేస్తోంది. అయితే మిల్కి బ్యూటీ టైమ్ మేనేజ్ మెంట్ ను చాలా కరెక్ట్ గా సెట్ చేసుకుంటుందట. అది కూడా తనకు తెలియకుండానే అన్ని పనులు కరెక్ట్ టైమ్ కి పూర్తి చేసుకొని వెళ్లడం తమన్నా స్టయిల్ అట.
రోజులో ఉండేది 24 గంటలే. ముఖ్యంగా జీవితంలో ఎంతో సక్సెస్ ఫుల్ అయిన వారికి కూడా అదే సమయం ఉంటుంది. కానీ కొందరు నాకు టైమ్ లేదు. క్షమించండి అని చాలా కారణాలు చెబుతారు. నేను 13 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. ప్రతిదీ టైమ్ కి తగ్గట్టుగా పూర్తి చేసుకొని మిగతా పనులను చూసుకుంటాను. సమయానికి తగ్గట్టు ఆ పనులను పూర్తి చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పుకొస్తోంది ఈ మిల్క్ భామ.