స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ చాన్క్స్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు కానీ నో చెప్పేసింది యాంకర్ నుంచి చిన్న హీరోయిన్ గా ఎదిగిన ఓ ముద్దుగుమ్మ . కానీ ఇక్కడ ఓ చిన్న కోసమెరుపు కూడా ఉంది ఏంటంటే.. స్వాతి నో చెప్పే సమయానికి బన్నీ స్టార్ హీరో కాదు. ఆమె చేయనన్నది బన్నీ తొలి సినిమా ‘గంగోత్రి’నట. ఈ విషయాన్ని స్వాతినే స్వయంగా చెప్తోంది.
నేను అప్పటికి ‘కలర్స్’ ప్రోగ్రాంతో మంచి పేరులో ఉన్నాను. అప్పుడే ‘గంగోత్రి’ సినిమాలో నటించమని నన్ను అడిగారు. కానీ నాకు అప్పటికే ఎంసెట్ కౌన్సెల్సింగ్ పూర్తయి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది. టీవీ షో కూడా ఆపేసి చదువు మీద ద్రుష్టి పెడదాము అనుకున్నాను. అందుకే ఆ సినిమాకు నో చెప్పేశాను. ఐతే టీవీ షో చేస్తుండటం వల్ల మెడికల్ కాలేజీలో చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే కాలేజీ హాస్టల్ వదిలేసి వచ్చేశాను.
ఇక తాను డబ్బింగ్ ఆర్టిస్టుగా.. సింగర్‌గా మారడం గురించి స్వాతి చెబుతూ.. ‘‘జల్సా సినిమాలో ఇలియానా పాత్రకు డబ్బింగ్ చెప్పించేందుకు 30 మందిని ట్రై చేశారట. త్రివిక్రమ్ గారు కొత్త వాయిస్ కావాలని అడుగుతున్నారని.. మీరు డబ్బింగ్ చెబుతారా అని ఆ యూనిట్ సభ్యుడు ఒకరు అడగడంతో నాకు నచ్చి ఆ పాత్రకు వాయిస్ ఇచ్చా. ఆ తర్వాత ‘కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు’ సినిమాలో వర్మ గారి కోరిక మేరకు సరదాగా ఒక పాట పాడాను. అని ఆమె చెప్పింది.