లాజిక్ గా ఎవరి ఊహకు అందని విధంగా సినిమాను తెయ్యడమే కాకుండా సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడికి కూడా నెక్స్ట్ సీన్ ను ఊహించలేని విధంగా తియ్యడంలో దర్శకుడు సుకుమార్ స్పెషలిస్ట్. సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారంటే అందులో ఎన్నో లాజిక్స్. ఒక్కోసారి ఆ లాజిక్స్‌ను అందుకోవడం ఆడియన్స్‌కు పెద్ద పరీక్షే. ‘100% లవ్’, ‘వన్ నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ ఇలా ప్రతి సినిమాను తన లాజిక్స్‌తో నింపేశారు ఈ లెక్కల మాస్టర్. అయితే సుకుమార్ తన సినిమాలో లాజిక్స్‌తో పాటు ఎమోషన్స్‌కు కూడా కొంచెం చోటిస్తారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలను తెరపై బాగా చూపించి మాంచి మార్కులు కొట్టేశాడు సుకుమార్.
ఇప్పుడు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ ‘రంగస్థలం 1985’ అనే సినిమాను తీస్తుండడంతో ఇదొక ప్రయోగాత్మక చిత్రమని, దీనిలో కూడా అనేక లాజిక్స్ ఉంటాయని అందరూ భావిస్తున్నారు. కానీ ఇదొక పూర్తిస్థాయి పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్లు సుక్కు చెప్పాడు. 1985లో జరిగిన ప్రేమకథ కాబట్టి ఈ సినిమాలో లాజిక్స్ కంటే ఎమోషన్స్‌కు పెద్ద పీట వేయాలనుకున్నారట. దానికి తగ్గట్లుగా ఎమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించబోతున్నాడు ఈ లాజిక్ దర్శకుడు .
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ తరహా సన్నివేశాలకు బాగా కనెక్ట్ అవుతారని చెబుతున్నారు. పతాక సన్నివేశాలు కూడా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. థియేటర్‌లో ఈ సన్నివేశాలు గనుక వర్కవుట్ అయితే సుకుమార్ మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగానే కానిపిస్తోంది. ఇక ఈ సినిమాతో రాంచరణ్ చాలా కొత్తగా ప్రమోట్ అవుతాడని, క్లాస్ ప్రేక్షకులకు సుక్కు మరింత దగ్గరవుతాడని అంచనా వేస్తున్నారు.