చిత్రం: స్నేహమేరా జీవితం
నటీనటులు: శివ బాలాజీ.. రాజీవ్ కనకాల.. సుష్మ యార్లగడ్డ.. చలపతిరావు.. సత్య తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: మహేంద్రనాథ్
కళ: రామ కుమార్
ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్
నిర్మాత: శివ బాలాజీ
రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి
సంస్థ: గగన్ మేజికల్ ఫ్రేమ్స్
విడుదల తేదీ: 17-11-2017
స్నేహం, ప్రేమ – ఇవి రెండూ ఎవర్ గ్రీన్. వీటి గురించి ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకుడు మనస్సు కదిలించేలా తీస్తే ఎన్నిసార్లు ఎన్ని కథలతో సినిమాలు వచ్చినా చూస్తారు. తాజాగా శివబాలాజీ, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన సినిమా స్నేహమేరా జీవితం. స్నేహం విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది.
స్టోరీ:
మోహన్(శివ బాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. చలపతికి ఎమ్మెల్యే కావాలని కోరిక. ప్రతీ పైసా అందుకోసమే సంపాదిస్తుంటాడు. మోహన్.. ఇందిర(సుష్మ) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఏడాది పాటు ఆమె వెనకే తిరుగుతాడు. కానీ, ‘ఐ లవ్‌వ్యూ’ అని చెప్పలేడు. ఇందిరను ప్రేమిస్తున్న విషయం చలపతికి తెలుస్తుంది. స్నేహితుడికి సాయం చేద్దామనుకుంటాడు చలపతి. అయితే అనుకోకుండా చలపతి, ఇందిర చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనిస్తాడు మోహన్. తాను ప్రేమించిన అమ్మాయిని స్నేహితుడు లోబరుచుకుంటున్నాడని, భరించలేక ఆ వూరి నుంచి వెళ్లిపోతాడు. పక్క వూరిలో ఓ ప్రేమ జంటను కాపాడబోయి చిక్కుల్లో పడతాడు. మోహన్ ఈ సమస్యను నుంచి ఎలా బయటపడ్డాడు? తన స్నేహితుడిని ఎలా కలుసుకున్నాడు? చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా? అనేదే ‘స్నేహమేరా జీవితం’.
విశ్లేషణ:
స్నేహితులు విడిపోవడం, వారి మధ్య అపార్థాలు రావడం తిరిగి వారు కలుసుకోవడం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే అలాంటి కథల్లో ప్రేక్షకుడు హృదయాన్ని టచ్ చేస్తూ సాగేలా సీన్లు ఉండాలి. ఇలాంటి సీన్లను దర్శకుడు ఒక్కటి కూడా ప్రజెంట్ చేయలేకపోయాడు. బలమైన సన్నివేశం కాని, మనస్సును హత్తుకునే డైలాగులు కాని లేవు. షాక్ ఏంటంటే తన ప్రాణ స్నేహితుడు కనిపించకుండా పోతే, తన ఎమ్మెల్యే ప్రచారంలో బిజీ అయిపోతాడు చలపతి. ఇదెక్కడి స్నేహం అనిపిస్తుంది. ఈ సినిమా 1982 నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడి కథ, కథనాలు, ఆలోచనలు అక్కడే ఆగిపోయాయనిపిస్తుంది.
బలాలు:
+శివబాలాజీ, రాజీవ్ కనకాల
+సత్య కామెడీ
బలహీనతలు:
– కథ, కథనం
రివ్యూ & రేటింగ్ : 2/5
ఫైనల్ పంచ్ :
‘స్నేహమేరా జీవితం’ 1982నాటి పంచ్ లేని బోరింగ్ సినిమా.