ఎప్పటి నుంచో సస్పెన్స్ గా ఉన్న శృతిహాసన్ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయిగా కనిపిస్తోంది. ఆమె గత కొంత కాలంగా ఒక విదేశీయయుడితో ప్రేమలో ఉన్నట్టు పుకాయర్లు కూడా వినిపించాయి అయితే అవి వట్టి పుకార్లు కాదని ఇప్పుడు అర్ధం అవుతోంది.
లండన్‌కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్‌తో కొంతకాలంగా శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలాసార్లు శ్రుతి మైఖేల్‌ను ముంబయికి కూడా తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు శ్రుతి ఆయనను తీసుకువచ్చి తన తల్లి సారికకు పరిచయం కూడా చేసేసిందట. తాజాగా మైఖేల్, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో శ్రుతి పెళ్లి పీటలెక్కనున్నట్లు అందరూ ఫిక్స్ అయిపోయారు.
శ్రుతి తన ప్రేమ గురించి ఎప్పుడూ మీడియా ముందు నేరుగా చెప్పలేదు. కానీ, తన వ్యక్తిగత విషయాలను అందరితో చెప్పుకోవడం తనకు నచ్చదని చెప్తూనే , పరోక్షంగా ప్రేమ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు మైఖేల్‌ని తన తల్లికి పరిచయం చేశారు కాబట్టి, త్వరలోనే శ్రుతి పెళ్లికబురు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రుతిహాసన్ ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది. .