Gossipsబాహుబలి తో గరుడవేగ కి లింక్ ఏంటి ?

బాహుబలి తో గరుడవేగ కి లింక్ ఏంటి ?

బాహుబలి ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రజల్లో ఒక తెలియని ఉత్సాహం వస్తుంది.ఈ సినిమా అప్పట్లో సోషల్ మీడియా లో ఒక రూమర్ గా చెక్కర్లు కొట్టింది. బాహుబలి కి మరియు రీసెంట్ రాజశేఖర్ నటించిన గరుడవేగ కి ఏదో సంభంధం ఉందని సోషల్ మిడిల్ లో చెక్కర్లు కొడుతుంది.అసలు ఈ రెండు సినిమాలకి సంభంధం ఏమిటి అని ఆరాతీయగా బాహుబలి పార్ట్ వన్ ఆయక కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్న వార్త బాహుబలి సెకండ్ పార్ట్ విడుదల అయ్యేదాకా ప్రేక్షకుల్ని మంచి ఉత్కంఠంగా ఉంచిందనే చెప్పుకోవాలి.

అదే విధంగ ఇపుడు గరుడవేగ సినిమాలో కూడా ఒక సన్నివేశం వుంది. సినిమాలో హీరోకు క్యాన్సర్ ఉందా లేదా అన్నదే ఇప్పుడు ప్రేక్షకుల్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఇందులో డాక్టర్ పాత్రలో పృథ్వీ కనిపించి హీరోకు సంబంధించిన రిపోర్ట్ చూసి క్యాన్సర్ ఉందో లేదో సరిగా చెప్పకుండా తన గోడేదో చెబుతుంటాడు. ఆ రిపోర్ట్ చూసిన హీరో పై అధికారి క్యాన్సర్ అంటాడు. దీని మీద అక్కడక్కడా కొంచెం కామెడీ నడుస్తుంది. ప్రి క్లైమాక్సులో సినిమా సీరియస్ గా నడుస్తున్నపుడు కూడా ఈ తమషా కొనసాగుతుంది. ఐతే నిజంగా హీరోకు క్యాన్సర్ ఉందా లేదా అన్నది మాత్రం స్పష్టత ఇవ్వరు. మరి హీరోకు క్యాన్సర్ అనే అంశాన్ని కేవలం కామెడీ కోసం అలా వాడుకున్నారా.. లేక నిజంగా అతడికి క్యాన్సర్ ఉందా అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఓ వ్యక్తి ప్రస్తావిస్తే.. హీరోకు క్యాన్సర్ ఉందా లేదా అన్నది తనకు కూడా తెలియదని.. ప్రవీణ్ సత్తారునే అడగాలని రాజశేఖర్ అనడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news