రమణ సినిమాను తెలుగులో రాజశేఖర్ చేయాలని చూడగా మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ గా తెరకెక్కించాడు. ఆ సినిమా టైంలో రాజశేఖర్ చిరంజీవి మీద విమర్శలు చేయడం మెగా ఫ్యాన్స్ రాజశేఖర్ మీద దాడి జరపడం అంతా తెలిసిందే. వ్యవహారం అంతా సర్ధుమనిగాక చిరు స్పందించి రాజశేఖర్ ను కలిశారు కూడా. అదంతా ముగిసిన కథ.
ఇప్పుడు తను నటించిన గరుడవేగకు మెగా టచ్ ఇచ్చేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు రాజశేఖర్. సినిమాను చిరంజీవిని చూడాలని చెప్పేందుకు వెళ్లిన రాజశేఖర్ ను ఆప్యాయంగా పలుకరించిన చిరంజీవి ట్రైలర్ చూశా చాలా బాగుందని చెప్పారట. అంతేకాదు మా ఆఫీస్ లో సినిమా గురించి మాట్లాడుతున్నారని అన్నారట. మొత్తానికి గరుడవేగ కోసం రాజశేఖర్ వేసిన మెగా స్కెచ్ వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య, ఇప్పుడు చిరంజీవి ఇలా ఇద్దరి ఫ్యాన్స్ కు సినిమా ఎక్కేలా రాజశేఖర్ చేసిన ఈ ప్రమోషనల్ అటెంప్ట్ సినిమాకు బాగానే ఉపయోగపడేట్టు ఉంది.