భారీ చిత్రాల విడుదలపై స్పష్టత రావడం లేదు
గ్రాఫిక్స్ కారణంగా సినిమాల రూపకల్పక ఆలస్యమవుతోంది
ఫలితంగా చిత్ర నిర్మాణం తలకుమించిన భారంలా మారడమే కాక
దర్శక నిర్మాతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
సినిమా విడుదల తేదీ ఖరారు కాక డిస్ట్రిబ్యూటర్లు నానా ఇబ్బందులూ పడుతున్నారు.
వివరాలిలా ::
రజనీ నటించిన 2.ఓ సినిమా విడుదల ఓ సందేహంగా మారింది.ఈ సినిమా విడుదల తేదీ మూడు నెలల పాటు వాయిదా పడిందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ యూనిట్ మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు. కానీ కాలా కన్నా ముందుగానే ఈ సినిమా వస్తుందన్నది రజనీ మాట. దీంతో డిస్ట్రిబ్యూటర్లు వణికిపోతున్నారు. పదే పదే సినిమా విడుదల వాయిదా పడడం మంచిది కాదని అంటున్నారు. ఇప్పటికైనా సినిమా విడుదల తేదీని స్పష్టంగా ప్రకటిస్తే మేలని అభిప్రాపడుతున్నారు.అంతేకాదు 2.0 తెలుగు వెర్షన్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి.ఏకంగా ఎనభై కోట్ల రూపాయల కు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
డబ్బింగ్ సినిమా విషయంలో ఇది రికార్డు స్థాయి మొత్తం. ఇందులో క కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా చెల్లించే శారట.ఈ నేపథ్యంలో విడుదల తేదీ విషయంలో ఏ మాత్రం స్పష్టత లేకపోవడంతో ఈ సినిమా హక్కులను కొన్న తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు కొత్త భయాలు పుట్టుకువస్తున్నాయి. ఏదో అల్లాటప్పా గా కాకుండా భారీ మొత్తం వెచ్చిస్తున్న నేపథ్యంలో టెన్షన్ తీవ్ర స్థాయికి చేరుతోంది.ఇక వీటికి డైరెక్టర్ శంకరే సమాధానం చెప్పాలి మరి!!