చాలాకాలం తరువాత సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర ప్రస్తుతం ‘పి ఎస్ వి గరుడవేగ’ సినిమాలో నటించారు.ఈ సినిమా ని ప్రవీణ్ సత్తారు నిర్మించగా పూజ కుమార్ హీరోయిన్ గ నటించింది .రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది.ఈ సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది.
స్టోరీ:
రాజేశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారిగా పనిచేస్తుంటాడు.ఓ హత్యకు సంబంధించిన కేసును డీల్ చేస్తోన్న టైంలో దాని వెనక ఉన్న డ్రగ్ మాఫియా, అక్రమ మైనింగ్‌లలో చీకటి కోణాలను బయట పెడతాడు. ఫస్టాఫ్‌లో పైన చెప్పుకున్న అంశాలను రాజశేఖర్ దర్యాప్తు చేసే సన్నివేశాలు దర్శకుడు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
ఎనాలిసిస్ :
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్ ప్లే తో చాల ఎక్సయిటింగ్ గ సాగుతుంది. అద్భుతమైన నరేషన్ తో చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకువెళడు దర్శకుడు. రాజశేఖర్ లుక్స్ మరియు నటన పర్ఫెక్ట్ గ సెట్ అయ్యాయి ఈ చిత్రానికి. ఫస్ట్ ఆఫ్ లోనే త్రిల్లింగ్ ఎపిసోడ్స్ హైలెట్ గ నిలిచాయి.ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్ గ సాగింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ చాల త్రిల్లింగ్ గ సాగింది.
ఇక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొని ముఖ్యసన్నివేశాలలో లాజిక్ మిస్ ఇయినట్టుగా అనిపిస్తుంది. కొని విషయాలను సరిగా జస్టిఫై చేయలేదు దర్శకుడు. యాక్షన్ సన్నివేశాలను అద్భుతం గ తెరకేక్కిన్చారు. క్లైమాక్స్ పరవాలేదు అనిపించింది.మొత్తానికి సెకండ్ హాఫ్ ఎక్సపెటేషన్స్ కి రీచ్ అవలేదు అనే చెప్పాలి.
పెర్ఫార్మన్స్ :
ఎన్ఐఏ ఏజెంట్ గ రాజశేఖర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హీరోయిన్ పూజ కుమార్ డీసెంట్ పేరోఫిమెన్స్ ఇచ్చింది, హౌస్ వైఫ్ గ పర్ఫెక్ట్ గ సెటయింది. కిషోర్ ఒక కృషియల్ రోల్ ప్లే చేసారు. మిగిలిన నటీనటులు అంత ఎవరి పరిధిలో వారు బాగానే పెర్ఫర్మ్ చేసారు.
ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో, అద్భుతమైన డైలాగ్స్ తో పర్వాలేదు అనిపించింది ఈ చిత్రం. సన్నివేశాలకు తగ మూడ్స్ తో సినిమాటిగ్రఫీ సూపర్ గ అనిపించింది. మ్యూజిక్ అండ్ బెగ్రౌండ్ వర్క్ డీసెంట్ గ వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గ వున్నాయి.
ఫైనల్ వర్డ్ :
చివరిగా “పి ఎస్ వి గరుడవేగ” సినిమా ఒక త్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ.
రేటింగ్ : 2.75/5