పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే అభిమానులు ఊగిపోతారు. పవన్ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా వాళ్లకు అవేమి పట్టవు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా పవనిజం పవనిజమే. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ ఇప్పుడప్పుడే ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడంట.
అజ్ఞాతవాసి సినిమాని డిసెంబర్ వరకి పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. ఇంతలోనే ఆయనకు ఓ భారీ ఆఫర్ వచ్చిపడింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తే ఏకంగా 40 కోట్లవరకు పారితోషకం ఇస్తానని సదరు నిర్మాత తన ప్రతిపాదన పవర్ స్టార్ ముందు ఉంచాడట.
ఈ ప్రతిపాదనకు గనుక పవన్ ఒకే చెప్తే పవన్ రెమ్యూనేషన్ తో కలిపి సుమారు 80 కోట్లలో సినిమా నిర్మాణం పూర్తి చెయ్యాలని సదరు నిర్మాత ప్రణాళికలు వేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అవసరం అయితే పవన్ రెమ్యూనేషన్ మొత్తం ముందుగా చెల్లించేందుకు సదరు నిర్మాత అంగీకరించినట్టు తెలిసింది.
అంతే కాదు ఈ సినిమా నిర్మాణాన్నిపూర్తి చేసి రాబోయే ఎన్నికల సమయానికి రిలీజ్ చేస్తే అటు జనసేన పార్టీకి కూడా ఉపయోగపడుతుందని ఆ నిర్మాత తన మనసులో మాటను తెలియజేశాడంట. దీంతో పవన్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించేలేక , ఒప్పుకోలేక డైలమాలో పడ్డాడు.
సినిమా ఒప్పుకుంటే జనసేన పార్టీ మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేను, అలాగని ఇంత మంచి ఆఫర్ వదులుకుంటే రెమ్యూనేషన్ పరంగాను, అటు ఎన్నికల ముందు సినిమా రిలీజ్ చేసి ఆ క్రేజ్ వాడుకునే అవకాశాన్ని కోల్పోతానేమో అని పవన్ ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా పవర్ స్టార్ కి అంతటి క్రేజ్ ఉంది కాబట్టే అంత రెమ్యూనేషన్ ఇచ్చేందుకు కూడా లెక్క చేయడం లేదు. దట్ ఈజ్ పవర్ స్టార్.
ఈ ఆఫర్‌కు పవన్ ఆయోమయంలో పడ్డాడట. ఏమి చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నాడట. నిజానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత `జనసేన` పనులతో బిజీ కావాలని పవన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే మాత్రం దక్షిణాదిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ రికార్డు సృష్టిస్తాడు.