మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమా మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా ప్రారంభం నుండి కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. సినీ వర్గాల్లో మాత్రం కాస్త నమ్మకం ఉండేది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని, ఆధరణను పొందడంలో విఫలం అయ్యింది.
కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాలు తెలుగులో సక్సెస్ కావడం చాలా అరుదు. ఈ సినిమా అరుదైన సినిమాల్లో స్థానం దక్కించుకోలేక పోయింది. ఒక్కడు మిగిలాడు సినిమాలో మంచు మనోజ్ రెండు పాత్రల్లో కనిపించాడు. మంచు మనోజ్‌పై నమ్మకంతో, దర్శకుడు చెప్పిన కథపై నమ్మకంతో నిర్మాత దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేశాడు.
కాని సినిమా కనీసం రెండు మూడు కోట్లు కూడా కలెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే సగం థియేటర్ల నుండి తీసేశారు. అన్ని రైట్స్, కలెక్షన్స్ ద్వారా మూడు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏడు కోట్ల నష్టం నిర్మాత నెత్తిన పడ్డట్లే. మంచు మనోజ్ కెరీర్‌లో చాలా డిజాస్టర్‌లు ఉన్నాయి. కాని ఇది మీరీ దారుణమైన డిజాస్టర్ అంటూ ట్రేడ్ పండితులు అంటున్నారు.