తెలుగు ఖ్యాతిని చేసిన ఎన్టీఆర్‌పై బయోపిక్ రానుంది. తెలుగు వాడి గుండెల్లో అటు నటుడిగా, ఇటు రాజకీయ నేతగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్ తీసేందుకు పోటీలు పడుతున్నారు. అలాగే ఇంకా ఎవరూ పూర్తిస్థాయిలో నిర్మాణం మొదలెట్టక ముందే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయింది.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరిట ఎన్టీఆర్ రియల్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్‌ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్న రాంగోపాల్ వర్మ. ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా ఓ బయోస్కోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారు.
ఇదే అదునుగా భావించిన నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా ఈ సినిమా ముహూర్తం షాట్ కూడా కానిచ్చేశాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో ప్రధాన పాత్రను రాయ్ లక్ష్మి పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ లో బిజీగా కావడంలో డేట్స్ లో తేడాలు వచ్చాయి..దీంతో పూజాను ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదే విషయాన్నీ కేతిరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో అంగీకరించడమే కాకుండా, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తను తన టైమ్ లైన్ లో షేర్ చేసుకున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే..దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలో వీరగ్రంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించిందన్న విషయమై తాను సినిమా తీయనున్నట్టు ఇప్పటికే కేతిరెడ్డి స్పష్టం చేశారు.