ఇప్పటికే సౌత్ లో కుర్రాళ్లను తన అందంతో అల్లాడించిన రాయ్ లక్ష్మి బాలీవుడ్లో జూలీ- 2 ద్వారా మరింత హాట్ గా కనిపించబోతోంది. బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి చిత్రం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది.
ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది. గతంలో నేహా దూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జూలీ’ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో నేహా దూపియా తన న్యూడ్ అందాల ఆరబోతతో సంచలనం సృష్టించింది. నేహా దూపియాకు ఏమాత్రం తీసిపోకుండా లక్ష్మీ రాయ్ కూడా కనిపించబోతోంది.
సౌత్ సెక్సీ బ్యూటీ లక్ష్మీరాయ్ బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా అత్యంత బోల్డ్ గా నటించిన జూలీ2 సినిమా విడుదలకు ముందే మంచి హైప్ సాధించింది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న లక్ష్మీరాయ్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది.
నవంబర్ 24న సినిమా విడుదల కాబోతోంది. మాజీ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లాని ఇప్పుడు ఈ చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని మీడియా ముందుకొచ్చి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ చిత్రం ఓ మాజీ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాడు. ఆమె పేరు బయటపెడితే.. తమకు లీగల్ సమస్యలు తప్పవని.. సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు. అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు.
పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ కలిపి చూసినవాళ్ళంతా ఆ కథ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ నగ్మా అనే అనుకుంటున్నారు.
“1990-2000 మధ్య కాలంలో సౌత్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ కెరీర్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సౌత్ లో పెళ్లయిన ఓ సూపర్ స్టార్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఆ వివరాలతో పాటు సౌత్ నుంచి ఆమెను ఎలా బయటకు పంపించారు. తర్వాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది లాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.” అని జూలీ-2 సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెబుతున్నాడు.
ఆయన నగ్మా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆ కథ నగ్మాదే అంటూ ఒక టాక్ బయల్దేరింది. ఈ సినిమా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఓ తారామణి కథ అని ప్రకటించాడు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. అయినా పహ్లాజ్ పరోక్షంగా మాట్లాడింది నగ్మా గురించే అని కథనాలు మొదలయ్యాయి.
దీంతో ఈ వివాదంపై నగ్మా మాట్లాడింది. “ఇప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదు. ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు. పబ్లిసిటీ కోసం చెబుతున్నారో, సినిమాలో నా పై ఏమైనా ఉందో చూడాలి. సినిమా విడుదలయ్యాక చూసి మాట్లాడతాను” అని నగ్మా చెప్పింది. మొత్తానికి ఈ సినిమా ఎదో ఒక వివాదం రెపేలాగే ఉంది.