నటీనటులు: శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్, రేణు, శివాజీరాజా…
సంగీతం:- ప్రశాంత్ ఆర్. విహారి
దర్శకత్వం:- వివేక్ ఆత్రేయ
నిర్మాత:- రాజ్ కందుకూరి
విడుదలతేదీ: 24-11-2017
ఒ కప్పటితోపోలిస్తే సినిమాను చూసే విషయంలోప్రేక్షకుడి దృష్టికోణం పూర్తిగామారిపోయింది. నాలుగు ఫైట్‌లు..నాలుగు పాటలకు ఎప్పుడో కాలంచెల్లిపోయింది. కథలో కొత్తదనంలేకుండా సినిమా తీస్తే, అదిస్టార్ హీరో సినిమా అయినా,ప్రేక్షకులు దానిని నిర్దాక్షిణ్యంగాతిరస్కరిస్తున్నారు. కమర్షియల్‌హంగులకు దూరంగా, ఆహ్లాదకర సన్నివేశాలతోనడిచే చిన్న సినిమా అయినా.. దానికిబ్రహ్మరథం పడుతున్నారు. అందుకుఉదాహరణ ‘పెళ్లిచూపులు’. ఈ చిత్రంన్యూ ఏజ్ లవ్ స్టోరీలకు దారిచూపిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడేకథానాయకుడిగా ఎదుగుతూ తనకంటూగుర్తింపు తెచ్చుకుంటున్నాడుశ్రీవిష్ణు. ఆయన నటించిన చిత్రం’మెంటల్ మదిలో’. మరి ఈ చిత్రంశ్రీవిష్ణు కెరీర్‌ను మరో మెట్టుఎక్కించిందా?. కొత్త దర్శకుడువివేక్ ఆత్రేయ తొలి ప్రయత్నంఎలా ఉంది?
కథ:-
హీరో చంచెల మనస్కుడు. తేలిగ్గా ఒక అభిప్రాయానికి రాలేని తత్వం. కొనే వస్తువుల్లోనే కాదు..
జీవిత భాగస్వామి విషయంలో కూడా అదే మెంటాలిటీ. దీనికి తోడు ఆడాళ్లంటే చచ్చేంత గిల్టీ. సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడలేని ఆశక్తత. ఇన్ని దుర్గుణాలున్నోడికి తేలిగ్గా పెళ్లవుతుందా చెప్పండి?..
దానికి తగ్గట్టే..మనోడికి 29 ఏళ్లొచ్చినా పెళ్లి కాదు. అయితే.. వీడి రొట్టె విరిగి నేతిలో పడి… ఓ అమ్మాయికి నచ్చేస్తాడు.
ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. ఈ లోపు నానా తిప్పలు పడి మనోడ్ని కొంతవరకు మార్చుకుంది ఆ అమ్మాయ్. సారి.. ‘మార్చుకున్నాను’…
అనుకుంది. కుక్కతోక వంకరని మరచిపోయింది. తర్వాత ఏమైంది? అనేది సెకండాఫ్.
విశ్లేషణ:-
చాలాచిన్న లైన్. దాన్ని రెండు గంటలపాటు సినిమాగా మలచడం చాలా కష్టం.దర్శకుడు ఆత్రేయ దాన్ని సులభంగాదాటేశాడు. అరవింద్ కృష్ణ, స్వేచ్ఛ,రేణు ఈ మూడు పాత్రలు చాలా విభిన్నంగాఉంటాయి. అందులోనే వైవిధ్యంచూపించాడు. అరవింద్-స్వేచ్ఛలమధ్య నడిచే సన్నివేశాలు చాలాఅందంగా, సహజంగా చెప్పాడు దర్శకుడు.కథలో అద్భుతమైన మలుపులు, షాకింగ్‌విషయాలు ఏవీ ఉండవు. చాలా ఆహ్లాదంగా,ఓ పడవ ప్రయాణంలా సాగిపోతుంది.రేణు వచ్చాక ఎలాంటి మార్పులువచ్చాయన్నదే ఈ కథకు కీలకం. అప్పటివరకూ స్వేచ్ఛ పాత్రను ప్రేక్షకుడుబాగా ఇష్టపడతాడు. రేణు పాత్రకథలో ప్రవేశించడంతో కాస్త కుదుపువస్తుంది. కానీ, క్రమంగా రేణుపాత్రను కూడా ఇష్టపడతాడు. అంతలాఆయా పాత్రలను డిజైన్ చేసుకున్నాడుదర్శకుడు. ఏ సన్నివేశం బలవంతంగాఇరికించినట్లు అనిపించదు.ప్రతి సన్నివేశాన్నీ చాలా సహజంగాచూపించాడు. పాత్రల మధ్య సంఘర్షణ,వారి మధ్య సంభాషణల్లో ఎక్కడానాటకీయత ఉండదు. అంతా మన పక్కింట్లోజరుగుతున్నట్లు అనిపిస్తుంది.దాంతో ఆయా సన్నివేశాలకు తొందరగాచేరువవుతాడు ప్రేక్షకుడు. ద్వితీయార్ధంప్రారంభంలో కథ కుదురుకోవడానికికాస్త సమయం పడుతుంది. క్రమంగారేణు పాత్రను ప్రేక్షకుడు ఎప్పుడైతేఇష్టపడటం మొదలు పెట్టాడో.. మళ్లీకథలోకి వెళ్లిపోతాడు. పతాక సన్నివేశాలు ఈ కథకు న్యాయం చేశాయి. కాస్త వినోదం, కాస్త భావోద్వేగం, కాస్త వాస్తవికత కలగలిపి ఓచక్కటి ముగింపు ఇచ్చాడు దర్శకుడు.`పెళ్లిచూపులు` వంటి కథలు ఇష్టపడేవారికి ‘మెంటల్‌మదిలో’ నచ్చుతుంది.
నటీనటులు :
ఈ కథకుమూడు పాత్రలు కీలకం. శ్రీ విష్ణు,నివేతా పేతురాజు, రేణు. ఆ మూడుపాత్రలకు న్యాయం చేసే నటులనుతీసుకున్నాడు దర్శకుడు. ఎవరినటనా అసహజంగా అనిపించదు. శ్రీవిష్ణుకుతప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుంది.నివేతాకు తెలుగులో మరిన్నిఅవకాశాలు వస్తాయి. రేణు పాత్రలోవిద్యాబాలన్ పోలికలు కనిపిస్తాయి.చూడగానే ఆకట్టుకునేలా లేకపోయినాఆ పాత్ర గుర్తుండిపోతుంది. చాలారోజుల తర్వాత శివాజీరాజా ఓ మంచిపాత్రలో నటించారు. ఒక మధ్య తరగతితండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది.పతాక సన్నివేశాల్లో శివాజీరాజానటనే నవ్వులు పంచుతుంది.
చివరిగా చెప్పేదేంటంటే… రేపు 24న రానున్న ఈ సినిమా హిట్ అవుతుందా.
లేక సూపర్ హిట్ అవతుందా? అనేది చెప్పలేం కానీ.. జనం మెచ్చే సినిమా అవ్వడం మాత్రం ఖాయం. ఓ సినిమాకి కథ అవసరం లేదు క్యారెక్టరైజేషన్ చాలు అని నమ్మే ప్రతి నవతరం దర్శకుడికీ ‘మెంటల్ మదిలో..’ ఓ పాఠం.