సామాజిక అంశాలను తెరపై చూపించడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’ ఈ కోవకి చెందినవే. చెట్లను పెంచాలని పర్యావరణాన్నిరక్షించుకోవాలని ‘జనతా గ్యారేజ్’లో చూపించారు. గ్రామాలను దత్తత తీసుకుని పేదవారికి సాయం చేయాలన్న సందేశాన్ని ‘శ్రీమంతుడు’లో ఇచ్చారు.
ఇప్పుడు కొరటాల శివ-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. దీనికి ‘భరత్ అనే నేను’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
రాజకీయ ప్రధానంగా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ‘మహేష్ బాబు’ ముఖ్యమంత్రి పాత్రలో సందడి చేయనున్నాడని టాక్. చదువు విషయంలో ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఓ సీఎంగా మహేశ్ ఏం చేశాడు అన్న కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘శ్రీమంతుడు’ తరువాత ‘మహేష్’ – ‘కొరటాల’ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018 ఏప్రిల్‌లో ఈ చిత్రంప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మహేష్ స్మార్ట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల మనస్సులు గెలుచుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.