సినిమా విడుదలకు ముందే ఎన్నో భారీ అంచనాలు పెంచేసింది సెక్సీ స్టార్ రాయ్ లక్ష్మి నటించిన జూలీ -2 . ఈ సినిమా దెబ్బతో బాలీవుడ్ లో తన అందాల ఆరబోత చేస్తూ అక్కడ స్థిర పడిపోవాలని కలలు కంటూ ఉంది . ఇంతలోనే ఈ సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్లి తుస్ మంది. ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం తెగ హడావుడి చేసేసారు జనాలు. ప్రతి రోజు ఈ సినిమా గురించి ఎదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మాత్రం భారీ అంచనాలు పెంచేశారు.
రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అసలు రంగు బయట పడింది. సినిమాలో లక్ష్మి రాయ్ మొత్తంగా గ్లామర్ పైనే దృష్టి పెట్టింది. చిత్ర యూనిట్ పనితనం కూడా రాయ్ లక్ష్మి గ్లామర్ సీన్స్ లలోనే ఎక్కువగా ద్రుష్టి కనిపిస్తోంది. సినిమా దాదాపు రొటీన్ స్టోరీలా కనిపించింది. విచిత్రం ఏంటంటే ఈ అమ్మడు చేసిన స్కిన్ షో మొత్తం సెకండ్ ఆఫ్ లో కనిపించింది.
రాయ్ లక్ష్మి అందాలు కనులారా చూద్దామని వెళ్లి ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. సినిమాను చూస్తుంటే ఇంతకుముందు విద్య బాలన్ తీసిన సిల్క్ స్మితా బయోపిక్ “ది డర్టీ పిక్చర్” నుంచి ప్రేరరణ పొందినట్లు ఉంది. అలాగే ”హీరోయిన్” సినిమాలో సీన్లను కట్ చేసి పేస్ట్ చేసినట్లు కనిపించాయి.
సినిమా చూసిన ప్రేక్షకుడు లక్ష్మి అందాలు కూడా పూర్తిగా కనపడలేదు పోనీ కథ అయినా బాగుందా అంటే అదీ కూడా లేదట. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెంది తిట్టుకుంటూ బయటకి వెళ్లారు. సాధారణంగా బాలీవుడ్ లో చిన్న సినిమాలకు కూడా 2,3 రేటింగ్ ఇచ్చే క్రిటిక్స ఈ సినిమాకు 1 తో సరిపెట్టారట. పాపం రాయ్ బాలీవుడ్ లో స్థిరపడాలని చేసిన ప్రయత్నం మొదటి సినిమాతోనే ఫెయిల్ అయిపొయింది.