కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తిల క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తమిళ హీరోలే అయినా టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. గజిని సినిమా నుండి సూర్యకు తెలుగులో బీభత్సమైన క్రేజ్ వచ్చింది. అప్పటి నుండి తన ప్రతి సినిమా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు అయితే అన్న దారిఓనే కార్తి కూడా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించి ఇక్కడ అన్నకు సరిసమానంగా ఇమేజ్ ఏర్పరచుకున్నాడు.
అయితే ప్రస్తుతం సూర్య ఇమేజ్ కూడా దాటేసి తెలుగులో కార్తికే ఎక్కువ డిమాండ్ ఉందని అంటున్నారు. సూర్య నటించిన 24 తెలుగులో పర్వాలేదు అనిపించుకోగా సింగం-3 ఫ్లాప్ గా మిగిలింది. అందుకే ప్రస్తుతం విగ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న గ్యాంగ్ సినిమాకు తెలుగులో అంత బజ్ ఏర్పడటం లేదట. సూర్య సినిమాకు ఎగబడాల్సిన డిస్ట్రిబ్యూటర్స్ అంతా సగానికి సగం రేటు కుదించారట.
ఇదో రకంగా సూర్యకు తెలుగులో ఫాలోయింగ్ తగ్గిందని రుజువవుతున్నట్టే. ఈమధ్యనే కాతి ఖాకి తెలుగులో కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తానికి తమ్ముడిని లైన్ లో పెట్టిన అన్న తనకు తాను వెనుకపడటం ఆశ్చర్యంగానే ఉంది. మరి మళ్లీ సూర్య తన పాత ఫాంను కొనసాగించాలని ఆశిద్దాం.