స్నేహితుల మధ్య విబేధాలు రావడం సహజం. అయితే అవి కలకాలం మాత్రం ఉండవు అనేది మాత్రం నిజం ఆ విషయాన్ని మరో సారి రుజువు చేసారు మెగా స్టార్ చిరంజీవి – హీరో రాజశేఖర్. అసలు చిరంజీవి రాజశేఖర్లు ఎలా కలిసారో తెలుసా ..? తెలియదా అయితే చదవండి.
చియాంజీవి నేను గరుడ వేగా సినిమా సందర్భంగా చిరంజీవిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా మేమంతా కలిసిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతకు ముందే మేము ఇద్దరం కలిసిపోయామని హీరో రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.
‘చిరు గారితో నాకు విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉండిపోయాను. కానీ ఆ తర్వాత అప్పుడప్పడూ కలుస్తూనే ఉన్నాం. ‘మేముసైతం’ తో పాటు వేరే ఫంక్షన్లలో కలిశాం. మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో సపోర్ట్ కోసం జీవిత, చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్లగానే చిరంజీవి గారు రాజశేఖర్ ఎక్కడా అని అడిగారట.
జీవిత వెంటనే నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. కానీ నేను అప్పటికి రెడీ అయ్యి లేను . దీంతో ఆమె వెనక్కి వచ్చి నన్ను తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా మాకు అవసరమైన సహాయం కూడా చేశారు. ఆ తర్వాత మేమిద్దరం బాగా మునిపటిలా కలిసిపోయాం. ‘గరుడవేగ’ సినిమా విషయంలో కూడా ఆయన చాలా సపోర్ట్ చేశారని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఏమైతేనేం పాత మిత్రులు ఇద్దరూ కలిసిపోయారు కదా !