టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమా ఒక్కటికూడా ప్లాప్ అవ్వలేదంటేనే ఆయన టాలెంట్ ఏంటో మనకి అర్ధం అయిపోతుంది. ఇటీవల ఆయన తీసిన బంపర్ హిట్. బాహుబలి కలెక్షన్ల సునామీ తీసుకురావడమే కాకుండా జక్కన్న పేరు ప్రపంచమంతా మారుమోగేలా చేసింది. అయితే సినిమాకి పారితోషకం కి బదులు లాభాల్లో వాటా తీసుకుంటున్న రాజమౌళి ఆ డబ్బు అంతా భూమి మీద పెడుతున్నాడంట అదే అండి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నాడు.
రాజమౌళి ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతోంది. కాబట్టి లాభాల్లో వాటా కింద రాజమౌళి కనీసం వంద కోట్లయినా సంపాదించి ఉంటాడని అంచనా. రాజమౌళి మాత్రమే కాదు అతడి కుటుంబ సభ్యులు కూడా ఒక ప్యాకేజీ కింద డబ్బులు తీసుకుంటున్నారు. ఈ ఆదాయాన్ని అంతా వారు ఇలాగే భూమి మీద పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది .
హైదరాబాద్ శివార్లలో రాజమౌళి భారీ స్థాయిలో భూమి కొని ఫామ్ హౌస్ కట్టే ప్రయత్నం చేస్తున్నట్లు గతంలోనే పుకార్లు షికార్లు చేసాయి. దీంతో పాటుగా అనంతపురం.. విజయనగరం జిల్లాల్లోనూ రాజమౌళి భూములు కొంటున్నట్లు సమాచారం. ఇటీవలే రాజమౌళి అనంతపురం జిల్లాకు కూడా వెళ్లివచ్చాడట. అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ రాజమౌళి కనిపించాడట.
ఇదంతా భూముల కొనుగోలు.. రిజిస్ట్రేషన్ పనుల్లో భాగమే అంటున్నారు. భూమి మీద పెట్టే పెట్టుబడి అన్నింటికంటే సురక్షితమైందని.. ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేది కూడా అదేనని అంటారు. రాజమౌళి కూడా ఆ మార్గంలోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అనంతపురంతో పాటు హైదరాబాద్ సమీపంలో, విజయనగరం జిల్లాలో కూడా ఆయన భూములు కొనుగోలు చేశారట. కొన్ని రోజుల క్రితం రాజమౌళి 100 ఎకరాల భూమి కొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.