సినిమా హీరోల మీద ఫ్యాన్స్ కి మీద ఉండే అభిమానమే వేరు. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అని తెలిసినా అభిమానులు అవేమి పట్టించుకోరు.వారికి కావాల్సింది హీరో చూపించే హీరోయిజం. ఈ కారణం గానే హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది.
త్రివిక్రమ్ డైరక్షన్ లో పవన్ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి ‘ సినిమా మార్కెట్ కూడా ఇదే విధంగా ఆమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా ఆంధ్ర లో 50 కోట్ల రేషియోలో అమ్మేసారు. పవన్ సినిమాల్లో ఇదో సరి కొత్త రికార్డు గా ఇండ్రస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. దీంతో పాటు మహేష్ బాబు–కొరటాల శివ కాంబినేషన్ లోని భరత్ అనే నేను. అనే సినిమా మార్కెట్ కూడా మంచి ఊపు మీద ఉంది.
మహేష్ కి ప్రస్తుతానికి సరైన హిట్టు లేకపోవడంతో ఆయన మార్కెట్ అంతంత మాత్రంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అదేదీ వాస్తవం కాదని నిరూపించుకున్నాడు మహేష్. గతం లో ఇదే కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొరటాల శివ ఇప్పటి వరకు ఫ్లాప్ తీయలేదన్న భరోసా వుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు 45కోట్ల రేషియోలో చెబుతున్నారట.
స్పైడర్ సినిమా ప్లాప్ అయ్యింది కదా అంత మార్కెట్ ఉండదని అందరూ భావించారు. కానీ బయ్యర్లు ఎవరూ వెనకడుగు వేయడంలేదు. కొరటాల శివ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను కోనేందుకు బయ్యర్లు పోటీలు పడుతున్నారు. పెద్ద హీరోల సినిమాలన్నీ రోజు రోజుకు మార్కెట్ పెంచుకుంటూ పోతుండడం శుభపరిణామం గానే చెప్పుకోవచ్చు.