చాలాకాలం తరువాత సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర ప్రస్తుతం ‘పి ఎస్ వి గరుడవేగ’ సినిమాలో నటించారు.ఈ సినిమా ని ప్రవీణ్ సత్తారు నిర్మించగా పూజ కుమార్ హీరోయిన్ గ నటించింది .రాజశేఖర్ కెరీర్లోనే అత్యధికంగా రూ.25 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా ఏమాత్రం క్రేజ్ లేని దర్శకుడు. ఆయన ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ను అందుకోలేదు. అయినా కూడా అంత బడ్జెట్ను పెట్టేందుకు సాహసం చేశారు నిర్మాతలు. వారి సాహసం వృదా కాలేదు. గరుడవేగ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి.
మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా కలక్షన్ లు దాదాపు రెండు కోట్ల నలబై లక్షలకి చేరుకున్నాయి. ఈ కలక్షన్ అంతా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 4.12 కోట్ల షేర్ ను .. 7.28 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ‘గరుడ వేగ’కి ముందు వచ్చిన సినిమాలు .. తరువాత వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం, ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు.