యాంగ్రీ యంగ్‌మన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గరుడవేగ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాకు 25 కోట్లు ఖర్చు చేయడాన్ని అంతా కూడా తప్పుబట్టారు. రాజశేఖర్‌పై ఎలా 25 కోట్లు ఖర్చు చేస్తారు అంటూ సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా ఏమాత్రం క్రేజ్ లేని దర్శకుడు. ఆయన ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేదు. అయినా కూడా అంత బడ్జెట్‌ను పెట్టేందుకు సాహసం చేశారు నిర్మాతలు. వారి సాహసం వృదా కాలేదు. గరుడవేగ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా సక్సెస్‌తో రాజశేఖర్ మరికొన్నాళ్లు హీరోగా కంటిన్యూ అవ్వొచ్చు అంటూ కొందరు భావిస్తున్నారు.
దాదాపు దశాబ్ద కాలంగా రాజశేఖర్‌కు సక్సెస్ లేదు. అయినా కూడా హీరోగా కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు. ఒకానొక దశలో విలన్ పాత్రలు చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు. కొన్ని ఆఫర్లు వచ్చాయి కాని రాజశేఖర్‌కు ఆ కథ, పాత్రలు నచ్చక పోవడంతో నో చెప్పాడు. తాజాగా గరుడవేగ సక్సెస్ అయినంత మాత్రాన రాజశేఖర్ ఇక హీరోగా మళ్లీ కంటిన్యూ అవ్వొచ్చు అనుకోవడం పొరపాటు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజశేఖర్ హీరో పాత్రల నుండి తప్పుకోవడం మంచి నిర్ణయమని, తర్వాత సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం ఉండదు. అందుకే హీరోగా కెరీర్‌ను సక్సెస్‌తో ముగించాను అనే సంతృప్తి ఉంటుంది. అందుకే రాజశేఖర్ హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలకు ఓకే చెప్పడం మంచిది అంటూ సినీ విశ్లేషకులు మరియు ఆయన అభిమానులు కూడా కొందరు భావిస్తున్నారు.