రాధికా ఆప్టే అటు ఆర్ట్ సినిమాలు, ఇటు కమర్షియల్ సినిమాల్లోనూ నటించింది. బోల్డ్ గా నటించటమే కాక బోల్డ్ గా మాట్లాడే ఈ మరాఠీ ముద్దుగుమ్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో ఒకసారి లైంగిక వేధింపులను ఎదుర్కొందో, లేదో తెలియదు కానీ, టాలీవుడ్‌పై మాత్రం ఆమె బాంబు లాంటి వార్తల్ని పేల్చింది. ఒక హీరో, నిర్మాత పడకగది రమ్మని పిలిచారని చెప్పి సంచలనం సృష్టించింది ఈ ముద్దు గుమ్మ.
లైంగిక వేధింపులు అంటే ఆడవారికే అనుకుంటారు అందరూ కానీ మగవారు కూడా ఆ వేధింపులకు గురవుతున్నారు. అది కూడా సినిమా ఇండ్రస్ట్రీ లో ఏ వేధింపులు ఎక్కువయ్యాయట. ఇప్పటివరకు
సినిమా ఇండస్ట్రీలో అంటే హీరోయిన్లకే ఎక్కువగా ఈ వేధింపులు అనుకుంటాం. కానీ.. ఆడవారికే కాదు.. మగ వారికీ, ఆఖరికి చిన్నారులకీ.. ఈ వేధింపులు ఎక్కువే అంటోంది.. సంచలన కామెంట్లకు కేరాఫ్ గా నిలిచే రాధికా ఆప్టే.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని రాధికా ఆప్టే అంటోంది. ఒక్క సినిమా రంగంలోనే కాదనీ.. ప్రతి చోటా ఇలాంటి సమస్య ఉందని చెబుతోంది. ఎవరో ఒకరిద్దరు ఈ సమస్యపై మాట్లాడితే ఎలాంటి రెస్పాన్స్ రాదంటున్న ఆప్టే.. ఒకేసారి పది మంది గొంతెత్తితే తప్ప.. విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదంటూ వేదంతం చెప్తోంది ఈ బాలకృష్ణ హీరోయిన్.
సెక్స్ వేధింపులకు గురిచేసే వారి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడమే బెటర్ అంటోంది ఈ భామ. ఇలా చేస్తే మన పరువు కూడా పోతుంది కదా అంటూ కొంటే సమాధానం చెప్తోంది ఈ గడుసు సుందరి.