బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘పద్మావతి’. ఇందులో రణ్వీర్, దీపికాలు హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం అసభ్యకర, హిందూమతాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని అందువల్ల చిత్రాన్ని రిలీజ్ చేయరాదంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నారు.
దీంతో చాలా రోజులుగా ఈ సినిమాపై ఏదో ఒక చోట వివాదం తలెత్తుతూనే ఉంది. ఈ వివాదం ఇప్పట్లో చల్లబడేలా లేదు. సినిమా విడుదల కాకముందే చరిత్రను కించపరిచారని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అంతే కాకుండా తలలు తెగుతాయని చిత్ర హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇక దర్శకుడిపై కూడా అదే తరహాలో కామెంట్స్ చేశారు. క్షత్రియ వర్గానికి చెందిన ఎవరైనా వారి తలలను నరికేస్తే నజరానా ఇస్తామని చెప్పారు.
ఒకరు అయిదు కోట్లు ఇస్తామని చెబుతుంటే.. మరొకరు ఏకంగా పది కోట్ల రూపాయలను ఇస్తామని గట్టిగా చెప్పారు. అంతే కాకుండా వారి కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు. దీంతో బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ విషయంపై అనేక చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి సినిమా రిలీజ్ ని అయితే వాయిదా వేశారు. కానీ ఈ వివాదంపై కొత్తగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది.
ప్రభాస్ ఫ్యామిలీ రాజుల కుటుంబాలకు చెందినవారే. కృష్ణం రాజు క్షత్రియ వర్గాలతో జరిగే కొన్ని సమావేశాల్లో ఇప్పటికి పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ వివాదంలోకి ప్రభాస్ ని లాగాలని ఆ సామాజీకా వర్గం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన ఇమ్మని ఒత్తిడి తెస్తున్నారట. ఐతే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఈ విషయంలో అడ్డం పడినట్లు సమాచారం. కుల గొడవల్లోకి ప్రభాస్ ని లాగొద్దని సుతిమెత్తగా వారిని వారించాడంట .