Movies"c/o సూర్య" రివ్యూ & రేటింగ్

“c/o సూర్య” రివ్యూ & రేటింగ్

యువ నటుడు సందీప్ కిషన్ వరుస పరాజయాల తరువాత ఫుల్ హోప్స్ తో వస్తున్న చిత్రం c/oసూర్య తమిళ్ డైరెక్టర్ సూసిందిరాన్ దర్శకత్వo  వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రం గా తెరకెక్కినది. టాలీవుడ్ లక్కీ గర్ల్ మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ క్రైమ్ త్రిల్లర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:
సూర్య(సందీప్ కిషన్) ఒక తండ్రి లేని కుర్రవాడు. తన తల్లితో నివసిస్తుంటాడు. స్నేహితులతో జాలిగా వుండే సూర్య , ఫ్రెండ్స్ కి బాగా విలువిస్తాడు. కథ లో రొటీన్ గా జనని(మెహరీన్) లవ్ లో పడతాడు సూర్య.  బాలు(హరీష్ ఉత్తమన్) సూర్య ఫ్రెండ్స్ లో ఒకరిని తన మనుషులతో కలిపి ఎటాక్ చేస్తాడు.మిగిలిన కధంతా సూర్య తన ఫ్రెండ్స్ ని ఫామిలీ ని బాలు నుండి ఎలా కాపాడుకుంటాడు అనే దాని పైన ఉంటుంది.

ఎనాలిసిస్:

ఫస్ట్ హాఫ్ మొత్తం ఫామిలీ ఎమోషన్స్ తో రొమాంటిక్ సన్నివేశాలతో,కామెడీ తో చాల ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతం గా ఉంటుంది. సాంగ్స్ డీసెంట్ గా అనిపించాయి. మొత్తానికి ఫస్ట్ హాఫ్ చాల ఎంటర్టైనింగ్ గా సాగిందని చెప్పాలి.
సెకండ్ హాఫ్ పూర్తిగా సీరియస్ గా మారిపోతుంది చిత్రం . కొంచెం ఎంటర్టైన్మెంట్,కమెర్షియల్ ఎలిమెంట్స్ లోపించాయి సెకండ్ హాఫ్. ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్ చాల గ్రిప్పింగ్ గా వుంది. సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపించుకుంటుంది.

పెర్ఫార్మన్స్ :

ఎప్పటిలాగే సందీప్ కిషన్ సింపుల్ యాక్షన్ తో మెస్మరైజ్ చేసాడు. అంచనాలని  ని రీచ్ అవుతూ సినిమా మొత్తని తన భుజాలపై నడిపించాడు సందీప్ కిషన్. మెహరీన్ స్క్రీన్ పై తక్కువ వున్న పర్వాలేదు అనిపించుకుంది. విల్లన్ గా హరీష్ ఉత్తమన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మిగిలిన నటులంతా ఎవరి పరిధిలో వారు బాగానే చేసారు.

c/o సూర్య కథ చాల క్రైమ్ త్రిల్లెర్ల కు పోలి వున్న దర్శకుడు సుసిదీరన్ తన స్క్రీన్ ప్లే నరేషన్ తో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసాడు. డైలాగస్ షార్ట్ గా వున్నా సరిగ్గా సెట్ అయ్యాయి ఈ త్రిల్లర్ కి. బ్యాగ్రౌండ్ స్కోర్,సినిమాటోగ్రఫీ సినిమా కి బలం చేకూర్చాయి.

ఫైనల్ వర్డ్ :
చివరిగా “c/o సూర్య” ఒక మంచి క్రైమ్ త్రిల్లర్ వున్న మూవీ.

రేటింగ్ : 3/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news