మహేష్ ని మించిపోయిన అనుష్క !

మహేష్‌బాబుకి మురుగదాస్‌ వంటి స్టార్‌ డైరెక్టర్‌ తోడయితే స్పైడర్‌ రైట్స్‌ తమిళంలో పద్ధెనిమిది కోట్లు పలికాయిఅలాంటిది తమిళ వారికి కనీసం పేరు కూడా తెలియని దర్శకుడితో అనుష్క చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్‌ థ్రిల్లర్‌ చిత్రం భాగమతికి తమిళంలో పదిహేను కోట్లు పలికాయిఅనుష్క ఆల్రెడీ తమిళంలో పేరున్న నటి అయినా కానీ స్టార్‌ హీరో లేకుండా ఆమె తమిళ చిత్రాలేమీ ఆడిన దాఖలాలు లేవు.

బాహుబలి ప్రభావం వల్లన భాగమతి చిత్రానికి కూడా మంచి క్రేజ్‌ వుంటుందనే అంచనాతో ఇంత రేటు ఇచ్చేసారటతెలుగులో కూడా భాగమతి బిజినెస్‌ జోరుగా జరుగుతోందిబయ్యర్ల కోరిక మేరకు సంక్రాంతి బరి నుంచి తప్పించి జనవరి 26న రిలీజ్‌ చేస్తున్నారుతమిళంలో ఈ చిత్రానికి పదిహేను కోట్లు రావడం అంతటా హాట్‌ టాపిక్‌ గానే మారిపోయింది.

తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న నయనతార చిత్రాలు కూడా ఎప్పుడూ ఇంత రేటుకి అమ్ముడవ్వల్లేదుఈ చిత్రం చాలా వెరైటీగా కనిపిస్తూ వుండడంఫస్ట్‌ లుక్‌తోనే బెస్ట్‌ మార్కులు కొట్టేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఇలా ఈ చిత్రానికి చాలా క్రేజ్‌ ఏర్పడిందని అంటున్నారుమహేష్‌మురుగదాస్‌ కలిసినా కూడా స్పైడర్‌కి తమిళంలో పది కోట్లు రాలేదుమరి అనుష్క చిత్రాన్ని కొన్న బయ్యర్లను ఆమె వడ్డున పడేస్తుందో లేదో చూడాలి.

Leave a comment