టాలీవుడ్ లో జేజమ్మ, దేవసేన క్యారక్టర్లతో మంచి పేరు తెచ్చుకున్న బొద్దుగుమ్మ అనుష్క శెట్టి ఇటీవల తన మనసులో మాటని బయటపెట్టేసింది. తాను ఒక క్రికెటర్ ని ప్రేమించా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవంగా చూస్తే.. క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజే అంతా ఇంతా కాదు. తమ అద్భుతమైన ఆటతీరుతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. వారి ఫాలోయింగ్ కూడా ఓరేంజ్‌లో ఉంటుంది. వీరితోపాటు టాప్ హీరోయిన్‌లు కూడా వారి అభిమానులే. ఎంతో మంది టాప్ హెరాయిన్ లు వీరితో ప్రేమాయణం సాగించడం మనం చూస్తూనే ఉన్నాం.
సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ తదితర క్రికెటర్లను గతం లో ఎంతో మంది తమ కలల రాకుమారుడిగా వూహించుకునే వాళ్లు. మొన్నటికి మొన్న బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ.. మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేయాలని, అతనితో కలిసి బైక్‌పై విహరించాలని ఉందని వెల్లడించింది. అంతగా వారిని ఆరాధిస్తూ ఉంటారు జనాలు. తాజాగా ఆ బాటలో అనుష్క కూడా చేరిపోయింది. తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదండోయ్ ఒకప్పుడు ఆ క్రికెటర్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో కూడా పడిపోయిందట.. ఈ విషయం అనుష్కనే స్వయంగా ఓ వెబ్ పోర్టల్‌కు ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించాడు. దీనికి అనుష్క ‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని బదులిచ్చింది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ భారత్-ఏ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరి దీనిపైన రాహుల్ ద్రవిడ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.