Moviesతల్లైన బాలకృష్ణ హీరోయిన్...

తల్లైన బాలకృష్ణ హీరోయిన్…

రస్నా బేబీగా అందరికీ తెలిసిన అంకిత ‘లాహిరి లాహిరి లాహిరి’లో చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై ‘ప్రేమలో పావని కళ్యాణ్‌, ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ, సింహాద్రి, విజయేంద్రవర్మ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో తన నటనతో, తన గ్లామర్‌తో హీరోయిన్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ వెండి తెరమీద తన తన అందచందాలను బాగానే ఒలకపొసింది. ‘చీమ చీమ.’ సాంగ్ తో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడీ హీరోయిన్ తల్లయ్యింది. ఆదివారం ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అంకిత అభిమానులతో కూడా పంచుకుంది.
 ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమా ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. సినిమా అవకాశాలు తగ్గాక అంకిత న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ జగ్తాప్‌ను పెళ్లాడింది. 2016 లో వీరి వివాహం జరిగింది. యేడాది తిరిగే లోగా ఓ బాబుకి జన్మనిచ్చింది.. అంకిత. తన ముద్దుగుల కొడుకి నిల్ అనే పేరు పెట్టింది.
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news