ఎలాంటి విషయాన్నైనా జంకూ బొంకూ లేకుండా చెప్పేయడం నేటి సినిమా హీరోయిన్స్ కి ఒక ఫ్యాషన్ అయిపోయింది. టాపిక్ ఏదైనా అవ్వనివ్వండి మాకేంటి సిగ్గు అన్నట్లుగా పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు. ఇదే కోవలో ప్రముఖ కోలీవుడ్ నటి ఆండ్రియా కూడా ఉన్నారు. నిస్సిగ్గుగా మాట్లాడంలో నేను ఎవ్వరికి తీసిపోని అన్నట్లుగా ఆమె యవ్వారం ఉంది. ఇంతకీ ఆండ్రియా చేసిన వివాదస్పద వాఖ్యలు ఏంటో తెలుసా ..?
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్ టాగ్ ‘మీ టూ’ పై మీ స్పందనేంటి అని అడిగిన ప్రశ్నకు ఆండ్రియా బదులిస్తూ.. ‘‘ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం’’ అని అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ . ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వివాదాస్పదం అయ్యాయి. తాజాగా ఆండ్రియా చేసిన ఈ వాక్యాలు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి .
విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో సినిమా గురించి చెబుతూనే ‘మీ టూ’ హ్యాష్ ట్యాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘డిటెక్టివ్ థ్రిల్లింగ్ మూవీ. డైరెక్టర్ మిస్కిన్ ఓ కల్ట్ డైరెక్టర్. సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. నవంబర్ 10న విడుదల కానున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సినిమాలో నేను గ్రే షేడ్స్ ఉన్న పాత్ర చేశాను. నా పాత్ర కోసం యాక్షన్ సీక్వెన్స్ కష్టపడి నేర్చుకున్నాను. అలాగే, హార్లీ డేవిడ్ సన్ బైక్‌ను నడపడం నేర్చుకున్నాను అని చెప్తోంది ఈ తమిళ బ్యూటీ. ఇంతవరకు బాగానే ఉన్నా ఆమె ఎవరితో పడుకుంటే ఏంటని చేసిన వ్యాఖ్యలు జోరుగా వైరల్ అవుతున్నాయి.