Gossipsప‌వ‌న్ అజ్ఞాత‌వాసి రికార్డుల వేట మొద‌లైందిగా..

ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి రికార్డుల వేట మొద‌లైందిగా..

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ అంటేనే అది క్రేజీ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిస్తే తెరపై మరో మ్యాజిక్ కి సిద్దమైనట్టే. ఈ ఇద్దరి కలయిక అంటేనే ఒక సూపర్ హిట్ ఖాయం అన్నంతగా ఫిక్సైపోయారంతా. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ కూడా ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనే చిత్రంలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం 25వ చిత్రం కావడం విశేషం. అజ్ఞాతవాసి అనే టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయకముందే ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటే ఇప్పుడు శాటిలైట్స్ రైట్స్ లోను పవన్ త్రివిక్రమ్ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలు ఎంతగా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటాయి అనేదానికి బుల్లితెర టీఆర్పీ రేటుంగులే ఉదాహరణ అందుకే ఆయన సినిమా కోసం ఛానెల్స్ అన్ని పోటీలు పది మరీ రేటు లెక్కచేయకుండా రైట్స్ సొంతం చేసుకుంటారు.ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలోనూ అదే జరుగుతుంది. పవన్ త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా శాటిలైట్ విభాగంలో హాట్ కేక్ గా మారింది.

గతంలో వీళ్లిద్దరూ కలిసి తీసిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈసారి వీళ్లు చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా శాటిలైట్ రైట్స్ ధర కూడా భారీగానే ఉండొచ్చు అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ ధర 14 కోట్ల రూపాయల నుంచి ప్రారంభమైన శాటిలైట్ బిడ్డింగ్.. ఫైనల్ గా 19 కోట్ల 50లక్షల రూపాయలకు ఫిక్స్ అయింది. జీ తెలుగు, స్టార్ మా, జెమిని ఛానల్స్ మధ్యన ఏర్పడిన భారీ కాంపిటిషన్ మధ్య జెమినీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. జీ తెలుగు ఛానెల్ ఆఖరి నిమిషం వరకు పోటీపడినప్పటికీ చివరిగా జెమినీనే పవన్ అజ్ఞాతవాసి సినిమా దక్కించుకుని బుల్లితెర మీద సందడి చేయించేందుకు సిద్దమైయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news