మాటల మాంత్రికుడిగా పేరుపొందిన టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమా చేసినా చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ అభిమానిస్తారు. అయితే అందరికి సాధారణంగా అయన మీద ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. అదేంటంటే ఈయనకు ప్రతీసారీ వైవిధ్యమైన కధలు ఎక్కడ నుంచి దొరుకుతున్నాయి. అంత క్రియేటివ్ గా ఎలా ఆలోచిస్తున్నాడు అనే ధర్మ సందేహానికి పులిస్టాప్ పడుతూ అసలు సంగతి బయట పడింది. పాత కథలనే కొత్తగా తీస్తూ తన టాలెంట్ ని నిరూపించుకుంటున్నాడు.
తన రెండో సినిమా ‘అతడు’ సినిమా లైన్ తీసుకుంటే అది వెంకటేశ్ ‘వారసుడొచ్చాడు’ మీకు గుర్తుకొస్తుంది. ఈ మధ్య నితిన్ హీరోగా ‘ఆ ఆ’ అని తీశాడు. ఆ సినిమా లైన్.. ఎక్కడిదో తెలుసా యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘మీనా నవలది. దాన్ని సేమ్ టూ సేమ్ దించేశాడు త్రివిక్రమ్. ఈ సినిమాతో విమర్శలను కూడా ఆయన ఎదుర్కొన్నాడు .ఇదే కథతో విజయనిర్మల గతంలో సినిమా చేసింది కూడా.
అయినా మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ తో తాజాగా ఆయన చేస్తున్న ’అజ్ఞాతవాసి’ సినిమా గతంలో వెంకటేశ్ చేసిన ‘ఒంటరి పోరాటం’ కథ అట. ఆ సినిమాలో వెంకటేశ్ ఒంటరిగా పోరాటం చేసి గెలుస్తాడు. ఇందులో పవర్ స్టార్ కూడా అలాగే చేస్తాడట. ఆ సినిమా జయసుధ.. వెంకటేష్ ని ఆయుధంగా చేసుకొని అన్యాయంపై పోరాడుతుంది. ఇందులో ఆ పాత్రను ఖుష్బూ చేస్తోంది. ఐడెంటిటీ దాచి పెట్టి అజ్ఞాతంలో తిరిగే పాత్రగా పవన్ కనిపిస్తాడట. అందుకే ఆ రహస్య జీవితానికి తగ్గట్టుగానే అజ్ఞాతవాసి టైటిల్ పెట్టినట్టు సమాచారం.