పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన్ను ఎవరన్నా దూరం చేసుకున్నా ఆయన జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేరు. దీనికి ఉదాహరణే పవన్ మాజీ భార్య రేణుదేశాయ్. పవన్ తో రేణుదేశాయ్ విడిపోయి చాల సంవత్సరాలు గడిచిపోయినా అవకాశం దొరికితే చాలు రేణు ఎదో ఒక సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూనే ఉంటోంది.
పవన్ వ్యక్తిగత జీవితం గురించి అతడి అభిమానులకే కాకుండా అందరికీ ఆసక్తి ఉండటంతో రేణు దేశాయ్ చెప్పే విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి. ఈనేపధ్యంలో ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్ తో అతడి పిల్లల సాన్నిహిత్యానికి సంబంధించి కొన్ని సంఘటనలను మీడియా ముఖంగా గుర్తుచేసుకుంది.
పవన్ తన కూతురు ఆద్యతో ఉండే సాన్నిహిత్యానికి సంబంధించిన విశేషాలు అత్యంత ఆసక్తి దాయకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను ఏవిషయం పై అయినా క్వశ్చన్ చేయగలిగిన ఆద్య మాత్రమే అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్ కు అకీరాతో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఎక్కువ అయినా ఆద్య పవన్ తో ఎప్పుడూ డిమాండింగ్ గా ఉంటుంది అన్నవిషయాన్ని బయటపెట్టింది రేణు దేశాయ్.
అప్పుడప్పుడూ ఆద్య తన తండ్రి పవన్ కు ఫోన్ చేసి ‘నాన్నా.. నువ్వెందుకు అంత బిజీగా ఉంటావు. ఐ మిస్ యు కదా. నువ్వు రేపు పుణెకు రా’ అని డిమాండ్ చేస్తుంది అన్నవిషయాన్ని తెలిపింది రేణు. దీనికి పవన్ నవ్వుతూ వారం టైం ఇవ్వమని ఆద్యకు చెప్పి ఒప్పిస్తాడని తెలియచేసింది రేణు. అంతేకాదు పవన్ తన కూతురుకు తెలుగు రాకపోవడంతో ఆమెతో మాట్లాడటానికి మరాఠీ నేర్చుకున్న విషయాన్ని రేణు చెప్పడంతో పవన్ అభిమానుల్లో కూడా ఆసక్తి బాగా పెరిగింది.
అయితే అకిరా మాత్రం పవన్ తో తెలుగులోనే మాట్లాడుతాడని కానీ పవన్ అకిరాలు జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అంతేకాకుండా ఫిలాసఫీ విషయాలు వారిద్దరి మధ్య చర్చకు వస్తాయని అనే విషయాలు కూడ రేణు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ వీరిద్దరు సినిమాల గురించి మాట్లాడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు అంటూ మరో లీక్ ఇచ్చింది రేణు. దీనితో పవన్ అకిరా ఆద్యాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగా చెప్పి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రేణుదేశాయ్.