తాప్సీకి ఎందుకు ఈ గతి పట్టింది?

సౌత్ లో ఏం చేసినా చెల్ల‌లేదు.. నార్త్ లో ఏం చేసినా చేయ‌కున్నా చెల్లుతుంది .. గ్లామ‌ర్ బేబీ తాప్సీ ఇప్పుడు బీ టౌన్ లో శ‌ర‌వేగంగా దూసుకు పోతోంది.యాక్టింగ్ టాలెంట్‌తో పాటు గ్లామ‌ర్ ఒల‌క‌బోతలో కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.పింక్.. బేబీ.. నామ్ షబానా లాంటి రెండు మూడు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డంతో పాటు ‘జుడ్వా-2’ సినిమాలో పూర్తి స్థాయి గ్లామర్ రోల్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

అంతేకాదు ఆ మ‌ధ్య రాఘ‌వేంద్రరావుపై కామెంట్స్ చేసిన ఈ అమ్మ‌డు త‌రువాత క్ష‌మాప‌ణ‌లు చెప్పి త‌ప్పుకున్న విష‌యం విధిత‌మే! ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు ఆమె గతంలో గ్లామ‌ర్ షోకి సంబంధించి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు. వెంట‌నే తాప్సీ పాప పూర్తిగా స్వరం మార్చేసింది. బికినీ వేయడమంటే మాటలనుకున్నారా.. దాన్ని ధరించి నటించడంలో ఉన్న కష్టం తెలిస్తే మీరిలా మాట్లాడరని.. ప్రేక్షకులకు ఏది కావాలో అదివ్వడం తన కర్తవ్యమని.. చెప్పి త‌ప్పుకుంది. ఏదేమైనా టీ టౌన్ క‌న్నా బీ టౌన్ లోనే ఆమె కాస్తో కూస్తో నిల‌దొక్కుంద‌న్న‌ది వాస్త‌వం!!

Leave a comment