Gossipsవాట‌మ్మ వాట్ ఈజ్ దిస్ : ట్రైల‌ర్ అదిర‌పోయింద‌మ్మా

వాట‌మ్మ వాట్ ఈజ్ దిస్ : ట్రైల‌ర్ అదిర‌పోయింద‌మ్మా

మన గతంలో జరిగిన కథలను చెబితే వినేవాడు ఫ్రెండ్. కానీ, ప్రతీ కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా ట్రైలర్ లో వినిపించిన గొప్ప మాట. అదిరిపోయిందీ డైలాగ్ అంతేనా! నిన్నటి వేళ విడుదలైన పాటలు కూడా!‘మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్. మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిస్తే లవర్’ అని మరో మంచి మాటని వినిపించాడు హీరో రామ్. మొత్తంగా డైలాగ్ టేకింగ్ సాంగ్ ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసొచ్చాయ్. అనుపమ, రామ్ మధ్య కట్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో వినవచ్చే ప్రతి మాట అద్భుతంగా తోస్తోంది.
ఆడియన్ కి కనెక్ట్ అవ్వడమే కాదు సినిమా సక్సెస్కీ ఈ మాటలే ప్రధాన బలం కానున్నాయి కూడా! ఇక యంగ్ లిరిసిస్ట్ శ్రీమణి రాసిన మూడు పాటలు, చంద్రబోస్ రాసిన రెండు పాటలు, దేవీ కంపోజింగ్ ఇలా అన్నీ అన్నీ అదిరిపోయాయ్. కచ్చితంగా ఈ జ్యూక్ బాక్స్ రాక్ స్టార్ ఇమేజ్ని పెంచుతుంది అనడంలో నో సెకండ్ థాట్. స్రవంతి సినిమాటిక్స్ బ్యానర్పై కృష్ణ చైతన్య నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.ఆడియో వేడుకలో రామ్ మాట్లాడుతూ ‘‘నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా ఇది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడు సమీర్, మా పెదనాన్న స్రవంతి రవికిషోర్, దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాకి నాలుగు స్తంభాలుగా పనిచేశారు.సినిమాలో కథానాయికలతో పాటు, స్నేహితుల పాత్రలు కూడా గుర్తుండిపోతాయి.

జీవితంలో ప్రతి ఒక్కరికీ కుటుంబం, స్నేహితులు ఉంటారు. కానీ అభిమానుల వల్ల మేం ఓ కొత్త అనుబంధాన్ని చూస్తాం. వాళ్లు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు’’ అన్నారు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ… ప్రతి మగాడి గెడ్డం వెనకాల కచ్చితంగా ఓ ఆడది ఉంటుంది’ అనే సంభాషణని చెప్పి అభిమానుల్ని అలరించారు రామ్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news