అనేకానేక ఒడిదొడుకులు దాటుకుని విజయ్ నటించిన మెర్శల్ ఈ దీపావళి కానుకగా రిలీజైంది. కానీ అది తమిళం వరకే పరిమితం. తెలుగులో మాత్రం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేక నిర్మాత శరత్ మరార్ కు చుక్కలు చూపించింది. సెన్సార్ పరంగా తలెత్తిన సమస్యలు కారణంగా ఈ చిత్ర విడుదల అర్ధంతరంగా నిలిచిపోయింది.‘మెర్శల్’కు తమిళంలోనూ సెన్సార్ సమస్యలు తలెత్తాయి.
ఈ చిత్రం కోసం జంతువుల్ని హింసించారన్న ఆరోపణలతో జంతు సంరక్షణ శాఖ నుంచి ఎన్వోసీ జారీ కావడంలో ఆలస్యమైంది. ఐతే అక్కడ ఎలాగోలా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న ప్రకారమే ఈ రోజు సినిమాను రిలీజ్ చేశారు. కానీ తెలుగు వెర్షన్ సెన్సార్ విషయంలో ఏవో ఇబ్బందులు తలెత్తాయి. బుధవారం సినిమా సాయంత్రానికి కూడా సినిమా రిలీజయ్యేలా లేదు. రెండో రోజు కూడా రిలీజ్ కష్టమే అంటున్నారు. ఈ చిత్రంపై రూ.5 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన శరత్ మరార్ కు ఇది గట్టి ఎదురు దెబ్బే. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీగానే ఉన్నాయి.