మోడీతో ఎందుకు పెట్టుకోవాలి
జయని ఎందుకు విమర్శించాలి
అసలు ఎవరినైనా ఎందుకు కాంట్రవర్సీలోకి లాగకూడదు
ఇలా ప్రశ్నించి చూడండి సమాధానాలు వాటంతట అవే వస్తాయి
లేదంటే విజయ్ నటించిన తలైవా, మెర్శల్ సినిమాలే చెబుతాయి
కమల్ తర్వాత పరోక్షంగా రాజకీయ ఆసక్తిని లెక్కకు మిక్కిలి ప్రదర్శిస్తున్న హీరో విజయ్.ఇందుకు తన సినిమాలనే వేదికగా చేసుకుంటున్నా డు.ఇంతకుముందు తలైవా (తెలుగులో ‘అన్న’) అనే సినిమాలో పొలిటికల్ టచ్ ఇచ్చి కొన్ని పంచ్ డైలాగులు పలికి వివాదాస్పదమయ్యాడు. తాజాగా ‘మెర్శల్’ సినిమాలో కూడా కొన్ని డైలాగులు పొలిటికల్ సర్కిల్స్‌లో గ్రేప్ వైన్ గా మారాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ.. డిజిటల్ ఇండియా.. డీమానిటైజేషన్ లాంటి వాటిపై విజయ్ ‘మెర్శల్’లో సెటైర్లు వేయడం విశేషం. ఈ డైలాగులు తమిళనాట ప్రకంపనలు రేపుతున్నాయి.
దీంతో కమల నాథులు మైక్ అందుకుని విజయ్ పై ఎటాక్ కి సిద్ధం అయిపోయారు. మోడీ చేసిన మంచేంటో అర్థం చేసుకోకుండా విజయ్ అపరిప క్వంగా డైలాగులు పేల్చాడని విమర్శిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సినిమాని వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఐతే తమిళ జనాల నుంచి మాత్రం ఈ డైలాగులకు మంచి స్పందన వస్తోంది. తమ రాష్ట్రంలో రాజ కీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచు కోవాలని మోడీ సర్కారు ప్రయత్నించడం..దీనికి తోడు డీమానిటైజేషన్ , జీఎస్టీ లాంటి విధాన పర నిర్ణయాలతో కేంద్రం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంపై తమిళ జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాని రూపొందించామని చిత్ర వర్గాలు చెబుతున్నా యి.