దృశ్యం .. గురు.. ఈ రెండింటికీ ఏమైనా సంబంధం ఉందా లేదు. రెండు వేర్వేరు కథలు కానీ వాటికి వెంకీ జోడించిన నటనా విలువలు మాత్రం ఎలా మరిచిపోగలం. అలానే ఈ సారి మరో రీమేక్ కథపై మనసు పారేసుకున్నాడు. బీ టౌన్ లో చిన్న సినిమాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న హిందీ మీడియం ని తెలుగులో తెరకెక్కిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు, ఇందుకు ఆ చిత్ర దర్శక నిర్మాతలతో సంప్రదింపులు నెరపుతున్నాడు.
ఓ విధంగా ఇది వెంకీకి హిట్ ఫార్ములా.. కలిసొచ్చిన ఫార్ములాని మరో మరు ఉపయోగిస్తే సినిమాని సేఫ్ జోన్ లో ఉంచవచ్చన్నది ఆయన అభిప్రా యం కావచ్చు. వాస్తవానికి రీమేక్ ట్రెండ్ ఇప్పటిదా కాదు కదా.. వెంకీకి రీమేక్‌లు కొత్తా కాదు కదా! అయినా ఈ దగ్గుబాటి వారింటి కథానాయకుడు అత్యధిక హిట్లు కొట్టింది పొరుగింటి కథలతోనే అన్న సంగతి ఎలా మర్చిపోతాం. అప్పుడెప్పుడో చంటి నుంచి నిన్నమొన్నటి దృశ్యం దాకా ఆయన సాధించిన విజయాలెన్నో..! వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు ఎంపికచేసుకునే కథానాయకుడిగా గుర్తింపు ఉన్న వెంకీ ఇప్పుడొక బీ టౌన్ ఫిల్మ్ పై కన్నే శా రు.
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, పాకిస్థానీ నటి సబా ఖమర్ జంటగా నటించిన హిందీ మీడియం సినిమా ని తెలుగులో రూపొం దించేందుకు స న్నాహాలు చేస్తున్నారు.ఈ కామెడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు డైరెక్టర్ గా అలా మొదలైంది ఫేం నందిని రెడ్డిని ఎంపికి చేశారు.ఈమె ఆధ్వర్యంలో రీమేక్ కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.హిందీ వెర్షన్‌లో ఇర్ఫాన్ ఖాన్ పోషించిన పాత్రను తెలుగులో వి క్టరీ వెంకటేష్ పోషించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రీమేక్ కోసం హిందీ మీడియం నిర్మాతలతో వెంకీ అండ్ కో జరుపుతున్న చర్చలు ఫలిస్తే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం.