వర్మ మంచి స్పీడు మీదున్నాడు
కానీ నాగ్ ఆ వేగాన్ని నియంత్రించేశాడు
సోగ్గాడుగా పేరున్న ఆయన ఈ సారి యాక్షన్ మంత్రం జపించనున్నారు.
28 ఏళ్ల తరువాత వర్మతో పనిచేయనున్న అక్కినేని వారసుడు తన నెక్స్ట్ మూవీ గురించి ఏం చెప్పాడంటే..
‘నాకు ఎప్పుడూ యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రాల్లోనే నటించాలని ఉంటుంది.ఈ నేపథ్యంలో వర్మ నాకు ఓ మంచి కథ వినిపించారు. ఇప్పటివరకు ఎమోషనల్, కుటుంబ కథా చిత్రాల్లోనే నటించాను. ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేయాలనుకుంటున్నాను. సరిగ్గా నేననుకున్నట్లుగానే వర్మ ఓ కొత్త కాన్సెప్ట్‌తో నా వద్దకు వచ్చారు.‘రాజుగారి గది -2’ సినిమాకు సంబంధించి మొన్నటి వరకు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడు విరామం కావాలి. అందుకే ఓ పది రోజుల పాటు విహారయాత్రకు వెళ్లానుకుంటున్నాను. వచ్చాక వర్మ చిత్రం మొదలుపెడతాను’ అని వెల్లడించాడు .
మరోవైపు వర్మ అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో బిజీబిజీగా ఉ న్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరిలో మొదలుకానుంది.అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నారు.మరి!నాగ్‌తో తీయబోయే సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత విడుదలవుతుందా లేక ముందే విడుదలచేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా శివ కాంబో లో వస్తోన్న ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనుందని,లేకపోతే తామిద్దరం కలిసి పనిచేసినా అందుకు అర్థం ఉండదని అంటున్నాడు నాగ్. ఇదే మాట వర్మ సైతం ధ్రువీకరించడం విశేషం.