ఓ సినిమా హిట్ అయితే అందులో హీరోకి ఉన్న ఫాలోయింగ్ గురించి మాట్లాడటం కామనే. అయితే ఈమధ్య హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడుకునేలా పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా మలయాళ భామల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో టాలీవుడ్ సినిమాల తీరు మారింది. స్టార్ సినిమాలు పక్కన పెడితే కుర్ర హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
నిన్న రిలీజ్ అయిన ఉన్నది ఒకటే జిందగి సినిమా తీసుకుంటే అందులో మహాలక్ష్మి మహాగా నటించిన అనుపమ ప్రేక్షకుల మనసు దోచేసిందని చెప్పొచ్చు. తెలుగు తెర మీద అందం అభినయంతో అనుపమ ఆకట్టుకుంటుంది. సినిమాలో ప్రేయసిని సగటు ప్రేక్షకుడు తన రియల్ లైఫ్ లో ప్రేమను ఊహించుకునేలా టాలీవుడ్ న్యూ గాల్ ఫ్రెండ్ అనుపమ అనేస్తున్నారు.
సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన అనుపమ సినిమాకు హిట్ లో కూడా భాగమయ్యింది. నేను శైలజ తర్వాత రామ్, కిశోర్ తిరుమల కాంబోలో వచ్చిన ఉన్నది ఒకటే జిందగి కూడా అదే రేంజ్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో అనుపమ మరో రేంజ్ కు వెళ్తుందని చెప్పొచ్చు.