మద్యం తాగడం తప్పు.. తాగి వాహనం నడపడం తప్పు.. అందుకనో / ఎందుకనో ఆ..తమిళ యువ హీరోకి వరుస కష్టాలు పలకరిస్తున్నాయి. జ ర్నీం ఫేం జై తన రియల్ లైఫ్ జర్నీలో తాగి వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడు.ఈ కేసు నిరూపణ అవ్వడంతో తమిళ యువ హీరో జై డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు అధికారులు రద్దుచేశారు.
మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఈ నెల మూడున సైదాపేట కోర్టుకు హాజరై ఛార్జిషీటు నకలను పొందారు. అటుపై విచారణకు ఆయన హాజరుకాకపోవడంతో జై తప్పుని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ని కోర్టు ఇష్యూ చేసింది. దీంతో శనివారం ఆయన కోర్టుకు హాజరై తప్పుని అంగీకరించారు.సినిమాల్లో ప్రవర్తించినట్లు బయట నడవడి ఉండకూడదని న్యాయమూర్తి హితవు చెప్పారు.ఈ కేసులో 5,200 రూపాయల అపరాధ రుసుము విధించారు.
ఆర్నెల్ల పాటు ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా గత నెల 21న మద్యం సేవించి అడయారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొని పోలీసులకు దొరికి పోయారు జై. వెంటనే పోలీసులు ఆయనపై ఛార్జిషీట్ ఫైల్ చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టుకు కేసుని ఫార్వర్డ్ చేశారు.ఇప్పటికైనా మన సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ ని మానుకుంటారో లేదో??