గౌతమి పరిచయం అవసరం లేని ప్రతిభావని.స్వతంత్ర భావాలున్న స్త్రీ. కమల్‌తో విడిపోయాక తనకంటూ ఓ జీవితాన్ని వెతుక్కుంటున్న మగువ. త్వరలో కమల్ రాజకీయ అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో తమిళనాట విపరీతంగా చర్చోపర్చలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే అక్కడి మీడియా గౌతమిని ఓ ప్రశ్న వేసింది.
కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా అని?? ఇందుకు ఆమె ఊహించని రీతిలో బదులిచ్చారు.అలాంటి రూల్ ఏమైనా ఉందా? అని అడగటమే కాదు.. కొంతకాలం సహజీవనం చేసినంత మాత్రాన రాజకీయాల్లో కలిసి నడుస్తామని భావించనక్కర్లేదని తేల్చేశారు. కమల్ కానీ రజనీకాంత్ కానీ రాజకీయాల్లోకి వచ్చినా.. పార్టీలు పెట్టినా అవి వారి సొంత నిర్ణయాలుగా భావిస్తానన్నా రు.
ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి.. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడతారో వారికే తన మద్దతు ఉంటుందన్నారు. ఇవన్నీచెబుతూనే తనకిప్పు డు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక లేదని స్పష్టం చేశారు.దీంతో ఇప్పుడీ టాపిక్ తమిళ్ మీడియా పొలిటికల్ సర్కిల్స్‌లో టాప్ రేటింగ్‌లో దూసుకుపోతోంది. అందరినోటా ఇదే విషయమై చర్చ సాగుతూ గ్రేప్ వైన్‌లా మారింది.