అర్జున్ రెడ్డి .. ఈ పేరు ఈ ఏటి టాలీవుడ్ సంచలనం.. ఏ అంచనాలు లేకుండా విడుదలై అన్ని వర్గాలనూ అమితంగా ఆకట్టుకుందీ సినిమా.తొలుత ఈ సినిమా శర్వానంద్ వెళ్లినా, చివరికి విజయ్ దేవరకొండ హీరోగా ఫైనలై అద్భుతం అనిపించుకుంది. ఆన్ స్క్రీన్ వండర్ అంటామే అంటే అదే ఇది. ఇప్పుడీ సినిమా తమిళ్ లో తెరకెక్కించాలని అక్కడి సినీ వర్గాలు భావిస్తున్నాయి.
విలక్షణ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ ని హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పుడీ సినిమాని డైరెక్ట్ చేసేందుకు బాల సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. క్రియెటివ్ జీనియస్ గా పేరున్న ఆయన గతంలో విక్రమ్ తో సేతు, పితామగన్ (తెలుగులో శివపుత్రుడు) సినిమాలని రూపొందించి అందరి మన్ననలూ అందుకున్న సంగతి విధితమే! ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్టుని కూడా ఆయనే టేకప్ చేయనుండడం విశేషం.