వాన వెల్లువలో రచ్చరచ్చ చేసింది తమన్నా.. మెగాపవర్ స్టార్ రాం చరణ్ తో స్టెప్పులేసి కుర్రకారు మతులు పోగొట్టింది. ఇప్పుడు మరో మారు వాన పాటకు పాదం కలిపేందుకు సై అంటోంది. అంతకుమునుపు నచ్చావురా అంటూ బన్నీతో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. ఈ సారి నందమూరి హీరో కల్యాణ్ రామ్ పై తమ చూపుల బాణాలను సంధించనుంది. వాన చెంత వలపు అస్త్రం సంధించనుంది.
ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ కూల్ బ్రీజ్ సినిమాస్ సంయుక్తంగా కల్యాణ్ రామ్ హీరోగా నిర్మిస్తున్న ఈ మూవీకి జయేంద్ర దర్శకుడు. ఈ సినిమాలోనే తమన్నా మరోసారి వానపాటలో అందాలు ఆరబోయనుంది. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ తో స్వింగ్ జరా అంటూ స్టెప్పులేయించి ఇప్పుడు అతడి అన్నకళ్యాణ్ రామ్ తో కలిసి స్టెప్పులేస్తుండడం విశేషం. వలపు వాన అంటూ సాగే ఈ పాటలో మిల్కీ బ్యూటీ హాట్ హాట్ గా కనిపించనుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
ఇటు గ్లామర్ కు అటు నటనకు గడిచిన పదేళ్లుగా సమ ప్రాధాన్యం ఇస్తూ దూసుకుపోతున్న అవంతిక ఆనందానికి ఇటీవల అవధి లేకుండా పోతోంది.ఎందుకంటే త్వరలోనే కథానాయిక ప్రాధాన్యం ఉన్న తెలుగు క్వీన్ లో నటించనుండడమే అందుకు ప్రధాన కారణం.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అనుష్క బాటలోనే తమ్మూ కూడా నడవడం ఖాయం.