వాస్తవ ఘటనలను మాత్రమే తాను తెరకెక్కించాలని భావిస్తుంటే లక్ష్మీ పార్వతికి ఇంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఎన్టీఆర్ చరిత్రపై ముందు భాగం తీస్తానన్న తేజకు – చివరి భాగం తీస్తానన్న వర్మకు ఆమె అభ్యంతరం చెప్పలేదని మధ్య భాగం తీస్తానన్న తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఆ మధ్య భాగంలో జరిగిన కథ వెనుక చాలా ఘటనలున్నాయని తనకు అనుమాన మన్నారు.
ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ? ఆమె కూడా సిద్ధమా? అని సవాల్ విసిరారు. వీరగంధం సుబ్బారావు హరికథలు చెప్పుకొని జీవించాడని ఆయన జీవితకథను నేను సినిమాగా తీస్తానంటే అభ్యంతరం ఎందుకని అడిగారు. ఒకవేళ తనను అడ్డుకోవాలని లక్ష్మీ పార్వతి భావిస్తే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆ..సినిమా తీసి తీరుతానని చెప్పారు.