అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి.గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్న నాగ్ చైతన్య , సమంత ఈ రోజు పెళ్లి బంధంతో ఒక్కటి కా zనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సంగీత్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా సన్నాహాలుచేశారు. ఇరుకుటుంబాల పెద్దలూ ఈ పెళ్లికి సమ్మతి తెలపడంతో అంగరంగ వైభవంగా గోవా తీరంలో ఈవేడుక జరగనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన ఓ వంద మందికి ఆహ్వానాలు అందాయి.
మరికొంతమంది అతిరథమహారథులూ ఈ వేడుకకు హాజరుకానున్నారు.వీరంతా ప్రత్యేక విమానంలో గోవా చేరుకోనున్నారు.ఇందుకు అయ్యే ఖర్చునంతా చైతు – సమంతానే భరిస్తున్నారు.ఓ సమచారం ప్రకారం పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహిస్తు న్నారు. వెంకీ, నాగ్ లు ఇప్పటికే ట్విటర్ వేదికగా నాగ చైతన్యను పెళ్లికొడుకుని చేసిన ఫొటోలను షేర్ చేశారు..‘అల్లుడి పెళ్లికొడుకు ఫంక్షన్లో ది గిన ఫొటో.చూస్తుండగానే ఎంత పెద్దవాడైపోయాడో.కంగ్రాట్స్ చై’ అని వెంకటేశ్ ట్వీటర్లో అభినందనలు తెలిపారు.
కొత్త పెళ్లి కూతురు కండీషన్ ఏంటంటే…
అక్కినేని వారింటి కోడలు సమంత అతిథులకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.తమ వేడుకకు వచ్చిన వారు ఫొటోలు తీసుకోవచ్చని వీడియోలు తీయ కూడదని కోరింది.తన పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసిందట! అయితే పెళ్లికి సంబం ధించిన ఫొటోలు మాత్రం విడుదల చేస్తామని తెలిపింది. వాస్తవానికి ఈ పెళ్లికి కేవలం దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు మాత్రమే హాజర వుతున్నారు.వంద మంది సమక్షంలో రెండు రోజులు పాటు రెండు మతాల సంప్రదాయం అనుసారం ఈ పెళ్లి జరగనుంది.ఈ రోజు రాత్రి 11 గంటల 52 నిమి షాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరిరువురి పెళ్లీ జరగనుంది.పెళ్లి సందర్భంగా సమంతని అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించారు.ఇందులో అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులు కనిపించనున్నారు.